భార్యను వేధిస్తున్న బుల్లితెర నటుడు!

Thadi Balaji wife complaint to police over husbandతన భర్త నిత్యమూ తాగి వచ్చి హింసిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని తమిళ నటుడు, టెలివిజన్ కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్న ‘దాడి’ బాలాజీపై సతీమణి నిత్య చెన్నై పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. మే 23వ తేదీన ఈ ఫిర్యాదు చేయగా, తాజాగా మీడియా ముందుకు విచ్చేసిన ఆమె… గత నెలలో బాలాజీ తనను కొడితే, పెద్ద గాయమైందని, తాను ఇప్పుడే కోలుకుంటున్నానని తెలిపింది.

ADVERTISEMENT

బాలాజీకి తనకు వయసులో 15 సంవత్సరాల వ్యత్యాసం ఉందని పెళ్లి తరువాతే తనకు తెలిసిందని, వయసు దాచి పెట్టి పెళ్లి చేసారని, తాను ఉద్యోగం చేస్తుంటే, ఆఫీసుకు వచ్చి నిత్యం గొడవ చేసేవాడని, తనను అనుమానిస్తూ చిత్ర హింసలకు గురి చేశాడని తెలిపింది. మొదటి భార్యలాగానే తాను కూడా అతన్ని వదిలేసి వెళతానన్న భయంతోనే ఇలా చేస్తున్నట్టు అనుమానంగా ఉందని తెలిపింది.

ADVERTISEMENT
Latest Stories