ఎస్.ఎస్.థమన్… “అఖండ” తర్వాత హీరో అంతటి క్రేజ్ ను సొంతం చేసుకున్న సంగీత దర్శకుడిగా మారారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే చాలు, హీరోయిజం తారాస్థాయిలో ఉంటుందని అందరి హీరోల అభిమానులు బలంగా విశ్వసిస్తున్న రోజులు.
అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” ట్రైలర్ లో థమన్ బ్యాక్ గ్రౌండ్ పై విమర్శలు వెలువడ్డాయి. నిజమే తన స్థాయికి తగిన బ్యాక్ గ్రౌండ్ ను థమన్ అందించలేకపోయారనేది వాస్తవం. ప్రస్తుతం ఆ డ్యామేజ్ ను నియంత్రించే పనిలో పడ్డారు.
“ధియేటర్లు ర్యాంప్ అమ్మా… అన్ని ట్రైలర్ లోనే వచ్చేయాలని అనుకుంటే ఎలా… ఫారెస్ట్ ఫైర్ కి, లోకల్ ఫైర్ కి తేడా ఉండాలిగా…. కలుద్దాం…” అంటూ తాజాగా ట్వీట్ చేస్తూ “భీమ్లా నాయక్” సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై నమ్మకాన్ని పెంచారు.
నిజానికి థమన్ సంగీతంపై ఎవరికీ ఎలాంటి అపనమ్మకం లేదు. థమన్ కు తగినంత సమయం ఇవ్వలేదేమో అన్న భావనను ట్రైలర్ చూసిన తరువాత అభిమానులు కూడా వ్యక్తపరిచారు. కారణం ఏదైనా ట్రైలర్ లో ఇవ్వలేకపోయాననే భావనను స్వయంగా థమన్ కూడా ఒప్పుకున్నారు.
ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ఈవెంట్ కు సంబంధించిన కార్యక్రమాలను ఇప్పటికే చిత్ర యూనిట్ పూర్తి చేయగా, సోమవారం నాడు రద్దు కాబడిన ఈవెంట్ బుధవారం జరగవచ్చనేది ఓ టాక్.
Theatres lo Rammmmmmppppp ammma .!! #BheemlaNayakOnFeb25th 💥💥💥💥💥💥
Annnii trailerrrrrr looooo naeeee expect cheasthaaaa yeeelllllaaaa ….
Forest fireeee 🔥 ki local fire ki
thedaaa vundaaaliii gaaa .!!!KALLUDHAM 🔥🤟🏽📣📣📣 https://t.co/giqZznMoO8
— thaman S (@MusicThaman) February 22, 2022



