దేవరకొండ… మరో పవన్ కళ్యాణ్ అవుతాడా..?

The Dream Behind Taxiwaala -టాలీవుడ్ లో ఎంతమంది అగ్ర హీరోలు ఉన్నా, యూత్ లో క్రేజ్ ఉన్న విషయంలో ఎప్పుడూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అగ్ర స్థానంలోనే ఉంటారన్నది అందరూ అంగీకరించే విషయమే. పవన్ చేసిన ‘తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషీ’ సినిమాలు ఎనలేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టగా, ఆ తదుపరి సినిమాలు వాటిని కొనసాగించాయి. అలా యూత్ లో పవన్ సంపాదించుకున్న క్రేజ్ ను మరే ఇతర హీరో కూడా అందుకోలేకపోయారు. ఇప్పటికీ పవన్ స్థానం అలాగే సుస్థిరంగా ఉంది.

ADVERTISEMENT

కట్ చేస్తే… గతేడాది వచ్చిన “అర్జున్ రెడ్డి” సినిమాతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ అనే పేరు సినీ ప్రపంచంలో మారుమ్రోగింది. యూత్ లో అయితే ఒక సంచలనమే! ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ప్రదర్శించిన క్యారెక్టర్ తో పాటు, బయట కూడా అదే రకమైన యాటిట్యూడ్ తో యూత్ లో విజయ్ ఆరాధ్యుడిగా మారిపోయాడు. ‘అర్జున్ రెడ్డి’ ప్రభావం ఇప్పటికీ ప్రేక్షకుల మీద ఉందని చెప్పడానికి నిదర్శనమే ‘టాక్సీవాలా’ సినిమాపై ఉన్న అంచనాలు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకులు పట్టాభిషేకం చేసారు.

మే 18న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా విజయ్ కు తగ్గట్లుగా డిఫరెంట్ గా ప్లాన్ చేసారు. ఆదివారం నాడు విడుదల చేసిన ప్రమోషన్ వీడియోనే ఇందుకు నిదర్శనం. విజయ్ దేవరకొండ క్రేజ్ మరింత పెంచే విధంగా ఉన్న ఈ వీడియో ఖచ్చితంగా “టాక్సీవాలా”పై అంచనాలు పెంచడానికి ఉపయోగపడేదే. ఈ సినిమా కూడా ‘అర్జున్ రెడ్డి’ మాదిరి సూపర్ సక్సెస్ అయితే, పవన్ కళ్యాణ్ మాదిరి యూత్ లో రియల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోగా విజయ్ దేవరకొండ నిలుస్తాడని చెప్పడంలో సందేహం లేదేమో!

ADVERTISEMENT
Latest Stories