లో రేటింగ్… నో మౌత్ టాక్… కానీ 3 రోజుల్లో 30 కోట్లు..!

The Nun Box office collectionsహాలీవుడ్ బొమ్మలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టడం కొత్తేమీ కాదు. అయితే తాజాగా విడుదలైన “ది నన్” సినిమాకు ప్రేక్షకుల నుండి అంత అద్భుతమైన స్పందన లభించలేదు, అలాగే విమర్శకులు కూడా భారీ రేటింగ్స్ తో స్వాగతం పలకలేదు, అయినా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ వారం హైలైట్ మూవీగా నిలవడం విశేషం.

ADVERTISEMENT

[m9ad]

హార్రర్ మూవీగా తెరకెక్కిన “ది నన్” తొలి రోజు 8 కోట్లు వసూలు చేయగా, రెండవ రోజు అంతకుమించి 10.20 కోట్లు వసూలు చేయడం విశేషం. దీంతో సెలవు రోజైన ఆదివారం కూడా రెండవ రోజుకు మించి వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అన్ని వర్షన్లు కలిపి మొత్తంగా 1603 స్క్రీన్లలో “ది నన్” విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.

ADVERTISEMENT
Latest Stories