ఫిష్ వెంకట్‌కి వీడ్కోలు పలికేవారే లేరు!

There was no one to say goodbye to Fish Venkat

కుబేర సినిమాలో “ఏం సార్ మేము మనుషులం కామా? మా ప్రాణాలకు విలువలేదా?” అంటూ బిచ్చగాడు దేవా (ధనుష్) అడిగిన ప్రశ్నని ఇప్పుడు టాలీవుడ్ పెద్దలని అడగాలి.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోటా శ్రీనివాస రావు చనిపోతే సినీ, రాజకీయ ప్రముఖులు అయన ఇంటికి క్యూకట్టి నివాళులు అర్పించారు. కన్నీళ్ళు పెట్టుకున్నారు.

ADVERTISEMENT

కానీ అదే సినీ పరిశ్రమలో అదే క్యారెక్టర్ ఆర్టిస్ ‘ఫిష్ వెంకట్’ రెండు కిడ్నీలు చెడిపోయి నెలరోజులుగా చావు బ్రతుకుల మద్య ఊగిసలాడుతుంటే, ఆర్ధికసాయం చేసి ఆదుకోమని అయన భార్య, కూతురు చేతులు జోడించి వేడుకున్నా ఒకరిద్దరు తప్ప ఎవరూ కనికరించలేదు.

చివరికి ఫిష్ వెంకట్ చనిపోతే సినీ పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా అయన ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చలేదు. కనీసం సంతాపం వ్యక్తం చేయలేదు. తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఆయన కుటుంబం అంత్యక్రియలు చేసేందుకు నలుగురి సాయం తీసుకోవలసి వచ్చింది.

“ఏం? ఫిష్ వెంకట్ తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారు కారా?ఆయన ఎవరూ ఇండస్ట్రీలో ఎవరికీ తెలియదా?” అంటే అందరికీ తెలుసు. కానీ వారి దృష్టిలో ఆయన ఓ అనామకుడు. ఆయన ప్రాణానికి విలువలేదు. చనిపోయినా పట్టించుకోనవసరం లేదనుకొని ఉండొచ్చు. అంటే కుబేర సినిమాలో బిచ్చగాడి పరిస్థితి అన్నమాట!

ప్రస్తుతం టాలీవుడ్‌ వందల కోట్ల బడ్జెట్‌ నుంచి వెయ్యి కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీసే స్థాయికి ఎదిగిపోయింది. కనుక ఫిష్ వెంకట్ వంటి దయనీయస్థితిలో ఉన్న నటీనటులను, సినీ కార్మికులను ఆదుకోవడం పెద్ద కష్టం కాదు.

కానీ అందరూ మాటలు, నీతులు చెప్పేవారే తప్ప ఆపత్కాలంలో ఆడుకోవడానికి ముందుకు రారని ఫిష్ వెంకట్ మరణంతో స్పష్టమైంది. ఇండస్ట్రీలో సాటి కళాకారుడు చనిపోయినా కనీసం పరామర్శించకాపోతే వారి మాటలకు అర్ధం, విలువ ఏముంటాయి?

ఇప్పటికైనా సినీ పరిశ్రమలో నిరుపేద కళాకారులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేసి, వైద్య చికిత్సలకు హాస్పిటల్ కట్టించలేకపోయినా అందరికీ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలు చేయించి ఏదో ఓ హాస్పిటల్‌తో టయ్యప్ చేయవచ్చు.

వీలైతే పెద్ద హీరో, హీరోయిన్లు, అగ్ర దర్శక నిర్మాతలు సొంత ఖర్చుతో ఒకరో ఇద్దరికో హెల్త్ కార్డులు ఏర్పాటు చేసి ఈయవచ్చు. సినిమాలలో హీరోయిజం, మానవత్వం చూపడం కాదు…. నిజ జీవితంలో కూడా చూపినప్పుడే రియల్ లైఫ్ హీరోలనిపించుకుంటారు.

ADVERTISEMENT
Latest Stories