“జనతా గ్యారేజ్”కు సంబంధించిన రెండు కొత్త సంగతులు!

Tirru as cameraman for NTR Janatha Garrageకొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న “జనతా గ్యారేజ్” సినిమా షూటింగ్ పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. ఆగష్టు 12వ తేదీ విడుదల టార్గెట్ గా దూసుకెళ్తున్న ఈ సినిమా మొదటి పాట రికార్డింగ్ పూర్తయ్యింది. దేవిశ్రీప్రసాద్ అందించిన బాణీకి రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఇటీవల కాలంలో అన్ని ప్రధాన సినిమాలకు రామజోగయ్యే సాహిత్యం అందిస్తున్నారు.

ADVERTISEMENT

ఇక, ‘జనతా గ్యారేజ్’కు సంబంధించిన మరో విశేషమేమిటంటే… “24” సినిమాకు అందించిన ఫోటోగ్రఫీ ద్వారా తిరు అనే పేరు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలలో మారుమ్రోగుతోంది. స్టన్నింగ్ విజువల్స్ తో విడుదలైన “24” టీజర్ ను కట్టిపడేసిన తిరునే “జనతా గ్యారేజ్”కు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. కొరటాల అంతకు ముందు రెండు సినిమాలకు మ్యాడీ ఫోటోగ్రఫీ అందించగా, తాజా చిత్రానికి మాత్రం తిరు ఫోటోగ్రఫీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories