“తొలిప్రేమ” సీక్వెలా… ఛాన్సే లేదు..!

Toli Prema Sequel Sai Dharam Tej - Rumorతెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, సినీ ప్రేక్షకులలో కూడా ‘పవన్ కళ్యాణ్’ అనే ఒక హీరో ఉన్నాడని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం ‘తొలిప్రేమ.’ అంతకుముందు వరకు చిరంజీవి సోదరుడిగా తెలిసిన పవన్, ‘తొలిప్రేమ’ తర్వాత నుండి మాత్రం తన సొంత ఇమేజ్ తోనే రాణిస్తున్నాడు. అంతలా పవన్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా అది. ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు గడిచినా, ఈ తరం కుర్రకారును కూడా ఊపేసే విధంగా ఉండే ‘తొలిప్రేమ’ సినిమాకు సీక్వెల్ రాబోతుందన్న వార్తలు ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

“తొలిప్రేమ” సినిమాను అందించిన కరుణాకరణే, ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారని, ఈ సినిమాలో పవన్ స్థానాన్ని సాయిధరమ్ తేజ్ భర్తీ చేయబోతున్నారని మీడియా వర్గాలలో హల్చల్ చేస్తున్న సమాచారం. పవన్ స్థానంలో సాయిని ఊహించుకోవడం ఎంత అసాధ్యమో… “తొలిప్రేమ 2” తెరకెక్కడం కూడా అంతే అసాధ్యమని లభించిన విశ్వసనీయ సమాచారం. కరుణాకరన్ దర్శకత్వంలో సాయి నటిస్తున్న మాట వాస్తవమే గానీ, ఇది ‘తొలిప్రేమ’కు సీక్వెల్ కాదన్నది స్పష్టమైన అంశం.

ADVERTISEMENT

అసలు ఈ వార్తకు ఊతమిచ్చిన అంశం ఏమిటంటే… ఇటీవల సాయిని దర్శకుడు కరుణాకరన్ కలిసి ఓ ప్రేమకధ వినిపించగా, అది విన్న సాయి వెంటనే చేద్దామని చెప్పడంతో, ఇది ‘తొలిప్రేమ 2’ అన్న పుకార్లకు కొబ్బరికాయ కొట్టినట్లయింది. అయితే ప్రేమకధలను అద్భుతంగా తెరకెక్కించడంలో దిట్ట అయిన కరుణాకరన్, ఓ ఫ్రెష్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనేది అసలు విషయం. పవన్ కు ‘తొలిప్రేమ’ ఎంత హిట్ అయ్యిందో, సాయికి ఈ సినిమా అంత హిట్ అవ్వాలని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories