ముంబైలో అసలు “కధ” మ్యాచ్ ముగిసాక ప్రారంభమైంది!

traffic around Wankhede Stadium for West indies Vs India T20
ఇండియా – వెస్టీండీస్ జట్ల మధ్య ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ కు సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాల నుండి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల వరకు అనేక మంది హాజరయ్యారు. అలాగే వీరికి తోడు వేల సంఖ్యలో వచ్చిన సామాన్యులు. మొత్తం కూడితే మ్యాచ్ తర్వాత అందరూ ఒకేసారి రోడ్ల పైకి రావడంతో వీరందరికీ అసలు ‘మ్యాచ్’ అప్పుడు ప్రారంభమైనట్లు ఉంది.

వాంఖేడే స్టేడియం పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులన్నీ కార్లతో నిండిపోయి దర్శనమిచ్చాయి. బహుశా ఇండియా విజయం సాధించినట్లయితే పండగ చేసుకుంటూ ఎంతసేపైనా రెట్టించిన ఉత్సాహంతో వెళ్ళే వారు. అయితే భారీ స్కోరు తర్వాత కూడా ఓటమి పాలు కావడంతో ఒక్కొక్కరు తమ అసహనాన్ని అంతా సోషల్ మీడియా వేదికగా వెళ్ళగక్కుతూ గృహాలకు చేరుకున్నారు. అందులో భాగంగా హల్చల్ చేస్తున్న ఫోటోనే ఈ కార్ల సముదాయం అంతా..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories