జూనియర్ ఎన్టీఆర్ కారుపై కొరడా… 700 ఫైన్..!

traffic police fined NTR-carప్రభుత్వం విధించిన నిబంధనల విషయంలో హైదరాబాద్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ ప్రజల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటీవల నగర మేయర్ హెల్మెట్ ధరించలేదని 100 రూపాయలు ఫైన్ విధించిన పోలీసులు, తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కారుకు ఫైన్ విధించి… అధికారులకు, సెలబ్రిటీలకు రూల్స్ అతీతం కాదని చాటి చెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్ కారు అద్దాలకు ‘బ్లాక్ ఫిల్మ్’ వేసి ఉండటంతో 700 రూపాయలు జరిమానా విధించారు. అమీర్ పేటలోని మైత్రీవనం చౌరస్తాలో ఈ ఉదంతం చోటు చేసుకుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మైత్రీవనం ఎదురుగా గల సారధి స్టూడియోలో వేసిన సెట్ లో ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కారు అద్దాలకు ‘బ్లాక్ ఫిల్మ్’ ఉంటే తొలగించాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వగా, నగరంలోకి వచ్చే వాహనాలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories