హీరో హీరోయిన్లపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిమానం కురిపిస్తూంటారు. సాధారణంగా బైక్లు, ఆటోలు, కార్లపై స్టిక్కర్లు వేయించడం అనేది ఇండియాలో చూపించే అభిమానం సర్వ సాధారణం. అయితే మరి ఇతర దేశాలలో ఉన్న వారు ఏ విధంగా అభిమానాన్ని చూపించుకోవచ్చు అంటే… యుఎస్ లో అయితే ఓ సౌలభ్యం ఉంది మరి!
తమకు ఇష్టమైన ఒక పేరును కారు పేరుగా గానీ, నెంబర్ గా గానీ పెట్టుకోవచ్చు. అందులో భాగంగా ఓ కారుపై ‘త్రిష’ పేరు కనపడడం విశేషం. యుఎస్ లోని పెన్సిల్వేనియా ఏరియాలో ఉన్న ఈ కారు ఫోటోను షేర్ చేసుకుంటూ హీరోయిన్ త్రిష ఓ ట్వీట్ చేసింది. ఎవరో తెలియదు గానీ చాలా క్యూట్ గా ఉందని.., వారికి థాంక్స్ అంటూ తన అనుభూతులను పంచుకుంది త్రిష.
అయితే ఇంతకీ అది హీరోయిన్ త్రిషపై కురిపించే అభిమానమేనా? లేక ఆ పేరును ఆ కారు ఇంటికి సంబంధించిన వారిదా? అంత క్లారిటీ అయితే త్రిష ఇవ్వలేదు గానీ, గతంలో ‘మహేష్ బాబు’ వంటి పలువురి హీరోల పేర్లతో కార్లు దర్శనం ఇవ్వడంతో, ఆ క్రమంలోనే ఇది కూడా ఉండవచ్చన్న ఫైనల్ నిర్ణయానికి త్రిష వచ్చేసినట్లున్నారు.



