త్రిషను రౌండప్ చేసిన ‘జల్లికట్టు’ మద్దతుదారులు!

Trisha Krishnan targeted by Jallikattu supportersతమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన దక్షిణాది నటి త్రిషకు ఇబ్బందులు ఎదురయ్యాయి. జంతు సంరక్షణ హక్కుల చట్టం (పెటా) కార్యకర్త కూడా అయిన త్రిష, ఈ ప్రచారం చేయడంపై పలువురు మండిపడుతూ, ఆమె షూటింగ్ ను అడ్డుకున్నారు. దక్షిణ చెన్నైకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని శివగంగలో ఆమె నటిస్తున్న ‘గర్జన’ చిత్రం షూటింగ్ జరుగుతోంది.

ADVERTISEMENT

సదరు ప్రాంతానికి వెళ్లిన ‘జల్లికట్టు’ మద్దతుదారులు ఆ షూటింగ్ ను అడ్డుకున్నారు. కార్వాన్ లో ఉన్న త్రిషను బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లడంతో పరిస్థితి చక్కబడింది. అయితే త్రిష క్షమాపణలు చెబితే కానీ తాము వెనక్కి తగ్గేది లేదని, అప్పటివరకూ చిత్రీకరణను అడ్డుకుంటామని ఆందోళనకారులు హెచ్చరించారు.

ADVERTISEMENT
Latest Stories