త్రివిక్రమ్ సినిమా అంటేనే మినిమం గ్యారెంటీ సినిమా. ఇది ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు అలా కాదు త్రివిక్రమ్ సినిమాలో పస తగ్గింది, ఎందుకంటే త్రివిక్రమ్ పెన్ లో ఇంక్ అయిపొయింది అందుకే. ఈ క్రమంలో త్రివిక్రమ్ తన ఆశలన్నీ అల్లు అర్జున్ సినిమా మీదే పెట్టుకున్నాడు.
తాజాగా ఎన్ఠీఆర్ తో త్రివిక్రమ్ చేసిన అరవింద సామెతా ఫార్ములా ఫ్లాప్ కావడంతో త్రివిక్రమ్ పని అయిపోయింది అని అనుకున్నారు అందరూ. మరో పక్క ఇదే లెక్కన టీవీలో కూడా అరవింద సామెతా కి చాలా తప్పవా రేటింగ్స్ వచ్చాయి. ఆ దెబ్బతో త్రివిక్రమ్ సీన్ అయిపోయింది అని అనుకున్నారు అందరూ.
ఎందుకంటే త్రివిక్రమ్ డిజాస్టర్ అయిన ఖలేజా సినిమా, సన్ ఆఫ్ సత్య మూర్తి కూడా టీవీలో భారీగా వ్యూయర్షిప్ దక్కించుకున్నాయి, కానీ అరవింద విషయంలో మాత్రం ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది. అంటే ఈ లెక్కన త్రివిక్రమ్ తన ఆశలన్నీ బన్నీ సినిమాపైనే పెట్టుకున్నాడు.
ఎలా అయినా ఆ సినిమా హిట్ అవ్వకపోతే త్రివిక్రమ్ సీన్ అయిపోయినట్లే అన్నది ఒప్పుకోక తప్పదు. మరి చూద్దాం త్రివిక్రమ్ ఈ సినిమాను ఎలా తియ్యబోతున్నాడో.



