దేవరకొండ తమ్ముడిని ఒక ఆట ఆడుకుంటారా?

trolls on anand deverakonda-విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్, జీవిత రాజశేఖర్ కుమార్తె శివాత్మిక తెరంగేట్రం చేస్తున్న సినిమా దొరసాని ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు ఆనంద్ మీద చాలా ట్రాల్స్ వచ్చాయి. ఇప్పుడు సినిమా తరువాత అవి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సినిమాలోని రాజు క్యారెక్టర్ కు ఆయన సరిపోయినా చాలా యావరేజ్ గా ఉన్నాడని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఆయన పెర్ఫార్మన్స్ కూడా ఒకే అంటున్నారు.

ఈ క్రమంలో ఆనంద్ మీద ట్రాల్స్ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మొదలయ్యింది. సహజంగా ఒక సెక్షన్ విజయ్ దేవరకొండ ఎదుగుదల మీద అక్కసుతో ఉన్నారు. అది కూడా ఆనంద్ మీద చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి దానిని తట్టుకుని ఎలా నిలబడగలడో చూడాలి. ఆనంద్ దేవరకొండ అమెరికాలో పెద్ద సాఫ్ట్ వెర్ ఉద్యోగాన్ని వదిలి సినిమాల మీద ఇంటరెస్ట్ తో ఇక్కడకు వచ్చాడు.

ADVERTISEMENT

మరి ఆయన తీసుకున్న రిస్క్ ఏం మాత్రం ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. మరోవైపు ఈ సినిమా శివాత్మిక పెర్ఫార్మన్స్, లుక్స్ కు మంచి మార్కులు పడటం గమనార్హం. ఈ సినిమా మీద ప్రస్తుతం మిక్స్డ్ టాక్ ఉండటంతో బాక్స్ ఆఫీసు వద్ద ఎలా పర్ఫర్మ్ చేస్తుందో చూడాలి. మరోవైపు ఈరోజే విడుదలైన సందీప్ కిషన్ నిను వీడని నీడను నేనే చిత్రానికి కూడా టాక్ పెద్దగా లేదు. ఒకవేళ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే అది సమంత ఓ బేబీకి అడ్వాంటేజ్ అవ్వొచ్చు.

ADVERTISEMENT
Latest Stories