సినిమా ఫ్లాప్ అవుతుందని హీరోకు ముందే తెలుసట!

Tubelight Box Office Salman Khan lowest openingరంజాన్ పండగ సందర్భంగా విడుదలైన స్టార్ హీరో సల్మాన్ ఖాన్ “ట్యూబ్ లైట్” సినిమా ప్రేక్షకుల నుండి దారుణమైన ‘మౌత్ టాక్’ను సొంతం చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు విమర్శకులు కూడా ట్వీట్లాభిషేకం చేసారు. సల్మాన్ రేంజ్ తో పోలిస్తే… ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువగా నమోదు కావడంతో, డిజాస్టర్ జాబితాలోకి చేరిపోవడం దాదాపుగా ఖాయంగానే కనపడుతోంది.

సినిమా విడుదలకు ముందు తన సినిమాకు ‘మైనస్’ రేటింగ్స్ ఇచ్చినా అభిమానులు వస్తారని సల్మాన్ ఎందుకు కామెంట్లు చేసారో కూడా ప్రేక్షకులకు ఇప్పుడు అవగతం అయ్యింది. ఈ కండల వీరుడికి ఉన్న క్రేజ్ కూడా ఓపెనింగ్స్ లో లేకపోవడంతో ఇక పరాజయాన్ని అంగీకరించని పరిస్థితుల్లోకి సల్మాన్ వచ్చేసాడు. సినీ విశ్లేషకుల రివ్యూలను ప్రస్తావిస్తూ… నిజానికి ఇంకా దారుణమైన రివ్యూలు వస్తాయని తాను భావించినట్టుగా తెలిపాడు.

ADVERTISEMENT

ఈ సినిమాకు ‘-3’ లేక ‘-4’ రేటింగ్స్ ఇస్తారని తాను అనుకున్నానని, కానీ, 1, 1.5 రేటింగ్స్ వచ్చాయని కాస్త వ్యంగ్యంగానే వ్యాఖ్యానించారు. అందులో కాసింత ఎటకారం ఉన్నప్పటికీ, ‘ట్యూబ్ లైట్’ దారుణ పరాజయాన్ని చవిచూస్తుందన్న విషయం సల్మాన్ కు ముందే తెలుసని అర్ధమవుతోంది. తన సంస్థ ‘బీయింగ్ హ్యూమన్’తో పీవీఆర్ ఒప్పందం చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘ట్యూబ్ లైట్’ ఫలితం గురించి సల్మాన్ స్పందించాడు.

ADVERTISEMENT
Latest Stories