కోర్టు మెట్లెక్కిన మరో టీవీ యాంకర్

anchor-ravi-today-attend-nampally-courtతెలుగు టీవీ యాంకర్లకు గడ్డు కాలం నడుస్తున్నట్టు ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టైన ప్రదీప్ రెండు మూడు రోజుల్లో కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. ఆయనకు స్వల్పకాలం పాటు జైలుకు వెళ్లాల్సిరావొచ్చు. మరోవైపు మరో యాంకర్ రవి కూడా కోర్టు మెట్లు ఎక్కాడు.

ADVERTISEMENT

నాగ చైతన్య ‘రారండోయ్ వేడుక చూద్దాం…’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో మహిళలను కించపరుస్తూ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను యాంకర్ రవి సమర్థించాడు. అప్పట్లో ఇది పెద్ద దుమారం లేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై ఓ మహిళ గతంలో కేసు పెట్టింది.

దీంతో కోర్టు వాయిదా బుధవారం ఉండడంతో రవి కోర్టుకు హాజరయ్యారు. అయితే… తదుపరి విచారణ ఫిబ్రవరి 7వతేదీకి కోర్టు వాయిదా వేసింది. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. అలాగే కేసు విషయాలను సోషల్‌ మీడియా ద్వారా తెలుపుతానన్నారు.

ADVERTISEMENT
Latest Stories