ప్రిన్స్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “స్పైడర్” టీజర్ ‘ఎలా ఉంటుందా?’ అన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్న నేపధ్యంలో… సోషల్ మీడియాలో ఓ సందేశం హల్చల్ చేస్తోంది. అదేమిటంటే… మోస్ట్ అవైటింగ్ తెలుగు మూవీ “స్పైడర్” టీజర్ ను చూసాను…. సింపుల్ గా మైండ్ బ్లోయింగ్… మహేష్ బాబు సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు… అంటూ అభిమానులకు ఫేస్ బుక్ లో ఓ సందేశం హల్చల్ చేస్తోంది.
“ప్రిన్స్ అవతారం చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని, క్లాసీ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ రాబోతోంది” అంటూ ఉమైర్ సండు ఇచ్చిన ఫేస్ బుక్ మెస్సేజ్ ప్రిన్స్ ఫ్యాన్స్ హంగామాతో వైరల్ అవుతోంది. మరి ఉమైర్ చెప్పిన మాటలు నిజమో, కాదో కాసేపట్లో తేలిపోనుంది గానీ, ఈ మెస్సేజ్ మాత్రం ప్రిన్స్ ఫ్యాన్స్ ను సంతోషపెడుతోంది. అయితే ప్రస్తుతం వస్తోన్న ‘స్పైడర్’ టీజర్ అన్నది కేవలం తళుక్కుమనే విధంగానే ఉంటుంది తప్ప, ఓ రొటీన్ టీజర్ లా ఉండదని తెలుస్తోంది.
టీజర్ విడుదల కాబోతున్న కొద్ది గంటల ముందు హంగామా చేస్తోన్న ఈ వార్తలు ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎందులో ఎలాంటి వాస్తవం ఉందో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. ఏది ఏమైనా దర్శకుడు మురుగదాస్ – మహేష్ కాంభినేషన్ పై గంపెడాశలతో ఈ టీజర్ వస్తోందన్నది నిజం. అంచనాలను అందుకుంటే… సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లే… లేదంటే… మళ్ళీ ట్రైలర్ వరకు ప్రిన్స్ ఫ్యాన్స్ నిరీక్షణ తప్పకపోవచ్చు. తినబోతూ రుచేందుకు… చూద్దాం..!



