పవన్ కళ్యాణ్… భయమెందుకురా… రా..!

pawan-kalyan-V hanumantha raoనిరాహార దీక్ష చేస్తున్న కాపు వర్గం నేత ముద్రగడను పరామర్శించేందుకు రాజమండ్రి చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. “పవన్ కల్యాణ్ కూడా నోరు విప్పాలండీ… ఎందుకు విప్పొద్దు? వాస్తవాలు చెప్పేందుకు భయమెందుకురా బాబూ నీకు? రా… వాస్తవాలు చెప్పు…” అంటూ పవన్ ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు.

“ఒకవేళ ముద్రగడ తప్పు చేస్తుంటే తప్పని చెప్పు… కరెక్ట్ చేస్తుంటే కరెక్టని చెప్పు… అంతే గానీ, నేను న్యాయం గురించి కొట్లాడతా… నేను అవినీతిని నిర్మూలిస్తా… ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ… ఆయన పెట్టిన పార్టీ పేరేంటి… జనసేనా… మరి జనసేన ఎక్కడా కనిపిస్తలేదే? ఇప్పటికన్నా నోరిప్పు మిత్రమా… మా మిత్రుడిది తప్పంటే తప్పని చెప్పు. కాపుల ఉద్యమం తప్పంటే తప్పని చెప్పు. లేకుంటే తప్పుకాదని చెప్పు. రెండూ చెప్పకుంటే ఎలా?” అని అన్నారు.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే… ముద్రగడను కలిసేందుకు వీహెచ్ ని అనుమతించని పోలీసులు హోటల్ గదిలోనే నిర్బంధించారు. అయితే వచ్చిన కార్యం చూసుకోకుండా, అసలు సీన్ లో లేనటువంటి పవన్ కళ్యాణ్ వెంట పడడం ఏంటో పవన్ అభిమానులకు అర్ధం కాని పరిస్థితి. ఓ పక్కన ఈ కుల రాజకీయాల్లో తన అభిప్రాయాన్ని చెప్పిన చిరంజీవిని వదిలేసి, సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఊసు ఎందుకు..? ఈ కులాల కంపులోకి తమ హీరో, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ ను లాగవద్దు అంటూ హితవు పలుకుతున్నారు పవన్ ఫ్యాన్స్.

ADVERTISEMENT
Latest Stories