ఒక్క నిర్ణయం వల్లభనేని వంశీ ని ఈస్థాయికి తెచ్చిందా.?

Vallabhaneni Vamsi's Political Fall Sparks Fresh Debate

టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గా కొన్నేళ్ల పాటు గన్నవరంలో తిరుగులేని రాజకీయ ఆధిపత్యం కొనసాగించిన వల్లభనేని వంశీ ఇప్పుడు నిస్సహాయంగా మారిపోయారు. రాజకీయాలలో తీసుకునే ఒకేఒక్క తప్పుడు నిర్ణయం ఆయన రాజకీయ జీవితాన్ని ఏమేరకు ప్రభావితం చేస్తుంది అనేదానికి వంశీ పొలిటికల్ కెరీర్ ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.

2019 లో టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచిన వంశీ ఆ తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో పార్టీ కండువాలు మార్చుకోవడంతో పాటుగా రాజకీయ విలువకు కూడా నీళ్ళొదిలేసారు. ఇక్కడ పార్టీ మారడం తప్పుకాదు కానీ పార్టీ మారిన తరువాత వంశీ చేసిన చర్యలే ఆ రాజకీయాయ్ పతనానికి పునాదులుగా మారాయి.

ADVERTISEMENT

రాజకీయాలకు సంబంధం లేని మహిళలను ఛట్ఠసభలకు లాగి వారి ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టారు. నారా భువనేశ్వరి పై నాటి వంశీ వ్యాఖ్యలు ఆయన రాజకీయ పతనానికి నాందిగా మారాయి. ఇక దానికి తోడు టీడీపీ కార్యాలయల మీద దాడి ఘటన, అందుకు సాక్ష్యులుగా నిలబడిన వ్యక్తుల కిడ్నాప్ కేసులు వంశీని మాజీ ఎమ్మెల్యే నుంచి ఒక ఖైదీగా మార్చేశాయి.

నాటి వంశీ వ్యాఖ్యలు, చర్యలు నేటి ఆయన రాజకీయ ఓటమికి కారణాలుగా నిలిచాయి. కూటమి అధికారంలోకి వచ్చాక అనేకమంది వైసీపీ నాయకులు వివిధ కేసులలో అరెస్టయ్యి బైలు మీద బయటకు వచ్చినప్పటికీ వంశీ కేసు మాత్రం వారికీ పూర్తి భిన్నంగా కనిపిస్తుంది.

లిక్కర్ కేసులో అరెస్టయిన వైసీపీ నేతలు ఇప్పటికి యాక్టీవ్ పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ అందగాడుగా జైలుకెళ్లిన వంశీ ఆ తరువాత రూపంతో పాటుగా ఆయన రాజకీయ విధానాలు కూడా పూర్తిగా మారిపోయాయి. గన్నవరంలో వంశీ రాజకీయ ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నారు.

తానూ కొన్నేళ్ల పాటు ఏసుకున్న రాజకీయ పునాదులు మొత్తం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వంశీ చేసిన స్వయంకృతాపరదాలతో చేచేతుల సంధి చేసుకున్నారు. ఇక నాటి నుంచి కూడా వైసీపీ చేస్తున్న రప్ప రప్ప రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న వంశీ తాజాగా ఒక పెళ్లి వేడుకకు హాజరయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అందులో వంశీ చాల నిరాశగా, నిస్సహాయంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో దూకుడుగా ప్రత్యర్థి మీద రాజకీయం చేసే వంశీ ఇప్పుడు సొంత వారి దగ్గర కూడా ఉత్సాహంగా కనిపించడం లేదు. వంశీ కనిపిస్తున్న ఈ మార్పు ఆయన అనుచరులలో ఆందోళన కలిగిస్తున్నాయి. వంశీ గతంలో మాదిరి యాక్టీవ్ రాజకీయాలు చేస్తారా.? అన్న సందేహాలు కూడా వ్యక్తపరుస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories