విజయవాడ రక్తచరిత్ర “వంగవీటి”కి వర్మ శ్రీకారం!

rgv-ranga80వ దశకంలో బెజవాడను వణికించిన హత్యా రాజకీయాలు ఒక్క రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. 1988, డిసెంబర్ 26వ తేదీన జరిగిన వంగవీటి మోహన రంగా హత్యోదంతంతో ఈ హత్యా రాజకీయాలు దూరమయ్యాయి. అయితే అసలు ప్రారంభమైంది “వంగవీటి రాధ వర్సెస్ దేవినేని మురళి” అన్నది బెజవాడ వాసుల్లో హల్చల్ చేసే సమాచారం.

ఇప్పుడు ఈ చరిత్ర అంతా వెండితెర రూపం సంతరించుకోబోతోంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ విజయవాడ “రక్తచరిత్ర”ను “వంగవీటి” అనే సినిమా పేరుతో తెరకెక్కించబోతున్నానని తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అనంతపురం ‘రక్తచరిత్ర’ను సక్సెస్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన వర్మ, ఈ బెజవాడ “రక్త చరిత్ర”ను ఏ విధంగా చూపించబోతున్నారనే కుతూహలం విజయవాడ వాసుల్లో కలగడం సహజమే.

ADVERTISEMENT

అందులోనూ ఇటీవల దేవినేని నెహ్రు – వంగావీటి రాధ చేసిన ప్రకటనలతో ‘వంగవీటి x దేవినేని’ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ తరుణంలో వర్మ చేసిన ప్రకటన మరింత ప్రాధాన్యతను దక్కించుకుంది. అయితే ఈ టైటిల్ ప్రకటనలో ‘ట్విస్ట్’లేమీ ఉండవు కదా! అంటున్నారు నెటిజన్లు. వర్మ కదా… ఏదైనా చెప్పలేం మరి!

ADVERTISEMENT
Latest Stories