‘యమదొంగ’ సినిమా ‘వరుణ్’ను మార్చేసింది!

Varun Sandesh Jr NTR Fanప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న వర్ధమాన హీరోల ఆరాధ్య అభిమాన హీరోలుగా ఎక్కువగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పేరులనే చెప్తుంటారు. ఎవరో నాగశౌర్య వంటి ఒకరిద్దరు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ వంటి పేర్లు బయటకు వెల్లడిస్తారు. అయితే తాజాగా వరుణ్ సందేశ్ కూడా తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ అని బయటపెట్టారు. నిజానికి తనకంటూ ఎవరూ ఫేవరేట్ లేరని, కాని ‘యమదొంగ’ సినిమా చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానిని అయ్యాయని చెప్పుకొచ్చారు ఈ ‘హ్యాపీ డేస్’ హీరో.

ADVERTISEMENT

నటించిన మొదటి రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్న తర్వాత దాదాపుగా వరుసగా 20కి పైగా సినిమాలు ప్లాప్ కావడంతో ప్రస్తుతం అవకాశాలు రాక ఎదురుచూస్తున్నారు. మధ్యలో ‘ఏమైంది ఈ వేళ’ వంటి సినిమాలు కాస్త పర్వలేదనిపించినా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రమూ బరిలో నిలవలేదు. ఒకానొక దశలో మరో నితిన్ లా మారుతున్నారని వరుణ్ ను అభివర్ణించినప్పటికీ, నితిన్ ను దాటేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు.

హీరోయిన్ వృతికా శేరుని పెళ్లి చేసుకుని ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని హాయిగా గడుపుతున్న వరుణ్, త్వరలో సినిమాలతో మళ్ళీ బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నుండి పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వర్గాల వారిని ఆదరించే మంచి చిత్రాలలో నటించాలన్న అభిలాషను వ్యక్తపరిచారు. మొదటి సినిమా నటించినపుడు చాలా భయపడ్డానని, అయితే తనకు లభించిన దర్శకుడు దానిని పోగొట్టారని, తన అభిమాన హీరో స్ఫూర్తితో మళ్ళీ నిలదొక్కుకుంటానన్న నమ్మకం ఉందని అన్నాడు వరుణ్.

ADVERTISEMENT
Latest Stories