మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “గ్యాంగ్ లీడర్” ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. చిరు కెరీర్ లో మైల్ స్టోన్ సినిమాలలో ఇది కూడా ఒకటి. పూర్తి కుటుంబా కధాంశంతో మాస్ ఎలిమెంట్స్ తో అప్పటి తరాన్ని ఒక ఊపు ఊపిన ఈ సినిమాలో చిరు కాకుండా మరో హీరోని ఊహించడం మెగా అభిమానులకు సాధ్యమయ్యే విషయమేనా..? అంటే దానికి ఈ ఫోటో..!
అయితే తానూ మాత్రం దీనికి అతీతం అంటున్నాడు మెగా వారసుడు వరుణ్ తేజ్. ‘ముకుంద’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, సినిమా సినిమాకు పరిపక్వతను ప్రదర్శిస్తూ ఎదుగుతున్న వరుణ్, తన చిన్నతనంలోనే మెగాస్టార్ చిరంజీవిని అనుకరించేవాడిని, అప్పటి ‘గ్యాంగ్ లీడర్’ ఫోజును పెట్టిన ఓ చిన్నప్పటి ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు వరుణ్.
మెగాస్టార్ రేంజ్ లోనే ఎక్స్ ప్రెషన్ ఇస్తూ కాలర్ ఎగరేసిన ఈ బుల్లి వరుణ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల నడుమ సందడి చేస్తోంది. బహుశా ఈ ఫోటోను నాటి దర్శకుడు విజయబాపినీడు వీక్షించినట్లయితే, ‘గ్యాంగ్ లీడర్’ పార్ట్ 2ను వరుణ్ తో చేసేవారేమో అనేటంతగా వరుణ్ హావభావాలు పలికించాడు మరి!



