సరి’కొత్త’కధల్లో వరుణ్ “జడ్జ్మెంట్” పక్కా?

Varun Tej next movie with director harish Shankarఅంతరిక్షం ప్రీ రిలీజ్ ఇవెంట్ లో ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ షరా మామూలుగానే హీరోని ఆకాశానికి ఎత్తేశాడు. అయితే సుకుమార్ తన గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూనే మరో పక్క వరుణ్ కధ జడ్జిమెంట్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వరుణ్ తేజ కధ ఎంపిక పై చాలా స్పష్టంగా ఉంటాడు అని, కధను ఎంచుకోవడంతో తాను అటు చిరంజీవి గారి లాగా, రజనీకాంత్ లాగా, అమితాభ్ లాగా పక్కాగా ఆలోచిస్తాడు అని, అదే మాటను రామ్‌చరణ్ తేజ కూడా తనతో చాలా సార్లు చెప్పాడు అని సుకుమార్ తెలిపాడు.

[m9ad]

ADVERTISEMENT

అయితే వరుణ్ పట్టుమని పది సినిమాలు చెయ్యలేదు…మరో పక్క తీసిన వాటిల్లో రెండు సినిమాలు మినహా మిగిలనివి అన్నీ ఇలా వచ్చి, అలా వెళ్లినవే. ఫిదా తర్వాత కంచే బారీ హిట్ అవగా, తొలి ప్రేమ ఓకేగా నిలిచింది. మరి తీసిన వాటిల్లో ఎక్కువశాతం ఫ్లాప్స్ ఉన్నా వరుణ కధను ఎంచుకోవడంలో మంచి టేస్ట్ ఉంది అనడం సుకుమార్ ఏ లాజిక్ తో అన్నాడో అర్ధం కానీ విషయం.

ఇక ఒక్కటి మాత్రం ఒప్పుకుని తీరాలి…చాలా డిఫరెంట్ కధలను ఎంచుకుంటున్నాడు వరుణ్. తొలి సినిమా ముకుందా తర్వాత ఫిదా, మరోపక్క కంచే, ఇప్పుడు అంతరిక్షం, రానున్న ఎఫ్2 ఇవన్నీ వేటికవే కొత్త రకమైన కధలు…అయితే డిఫరెంట్ కధలను ఎందుకోవడంలో వరుణ్ కి మంచి టేస్ట్ కనిపిస్తుంది కానీ..తప్పకుండా సక్సెస్ అవుతాయి అన్న జడ్జిమెంట్ లో మాత్రం సుకుమార్ లాజిక్ రాంగ్ అని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories