కరీనా కపూర్ ప్రధాన పాత్రలో, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, శిక్ష తలసానియా ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా వీరే ది వెడ్డింగ్. ఈ రోజు ట్రైలర్ విడుదలయ్యింది. నలుగురు స్నేహితురాళ్ళు.. వాళ్ళ జీవితం లో పారిపోయి పెళ్లి చేసుకున్నది ఒకరు.. పెళ్లిఅయినా గొడవలు పడేది ఒకరు.. పెళ్లే మధ్యలో వద్దన్నది ఒకరు.. ఈ ముగ్గురిని సమర్ధించేది ఇంకొకరు. ఇలా నలుగురు స్నేహితురాళ్లు జీవితాలు.. వీరే (కరీనా) పెళ్ళితో ఎలా ముడి పడి ఉన్నాయో సినిమా చూసి తెలుసుకోవాలి.
స్త్రీలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తే తట్టుకోలేని మగాళ్లు ఈ ట్రైలర్ చూసి దడుచుకుంటారు. కొన్ని చోట్ల డైలాగ్స్ మితిమీరి ఉన్నాయి, గ్లామర్ డోసు కూడా ఎక్కువే ఉన్న ఈ ట్రైలర్ లో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాగ్రౌండ్ స్కోర్, కెమెరా ఆకట్టుకుంటాయి. శశాంక ఘోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ని శోభాకపూర్, ఏక్తా కపూర్, అనిల్ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్
1 వ తేదీన విడుదల కాబోతున్నఈ సినిమా ట్రైలర్ చూసెయ్యండి.



