Venkatesh-Joins-Pawan-Kalyan-PK25తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు బహు అరుదు అన్న విషయం తెలిసిందే. అది కూడా విక్టరీ వెంకటేష్ కేంద్రంగానే మల్టీస్టారర్ సినిమాలు రూపొందుతుండడం విశేషం. మహేష్ తో కలిసి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో నటించగా, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ తో “గోపాల గోపాల” సినిమాలో నటించాడు. అయితే ప్రిన్స్ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలువగా, పవర్ స్టార్ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

Also Read – జగన్‌ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

అయితే తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ అతిథి పాత్రలో విక్టరీ వెంకటేష్ కూడా తళుక్కుమనబోతున్నాడన్న విషయం ఖరారైంది. ఈ రోజు నుండే షూటింగ్ లో పాల్గొంటున్న విక్టరీ – పవర్ స్టార్ కాంభినేషన్… ఈ సారైనా ఫ్యాన్స్ ఆకలి తీర్చే విధంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లోకి వెంకీ జత కాగానే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.




వెంకటేష్ చేసేది గెస్ట్ రోల్ అయినా… వీరిద్దరి కాంభినేషన్లోనే సీన్లు ఉన్నాయన్న సమాచారం ఫ్యాన్స్ ను నూతన ఉత్సాహంలో నింపుతోంది. త్రివిక్రమ్ డైరెక్షన్ కావడంతో… ఈ సారి మాత్రం సీన్లు అదిరిపోవాలి… ధియేటర్లు దద్దరిల్లిపోవాలి… అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి అభిమానులు ఆశించే అంశాలు సినిమాలో ఉంటాయా? ఉండవా? అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

Also Read – వైసీపిలో అందరూ భస్మాసురులేనా?