‘హుదుద్’ వరద బాధితుల నిమిత్తం సినీ ఇండస్ట్రీ రూపొందించిన ‘మేము సైతం’ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా బాగా ఎంజాయ్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే… అది ఒక్క వెంకటేష్ మాత్రమే! ఎలాంటి ఈగోలు, బేషజాలు లేకుండా ఎంజాయ్ చేసే వెంకటేష్ తాజాగా జరిగిన సిసిఎల్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు గ్రౌండ్ కు వచ్చారు.
ఈ క్రమంలో భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ టీంను సపోర్ట్ చేసిన వెంకీ, ప్రతి షాట్ కు చిన్న పిల్లాడు మాదిరి లేగిచి కేరింతలు కొట్టడం, చప్పట్లతో అభివాదాలు చేయడం… ఇలా ఒక్కటేమిటి… షాట్ షాట్ కు వెంకీ ఎంజాయ్ చేసిన తీరు వేరు అని చెప్పాలి.
గ్రౌండ్ లో తెలుగు వారియర్స్ ఓపెనర్లు సచిన్, ప్రిన్స్ లు ఎలా రెచ్చిపోయారో, అంతకంటే ఎక్కువగా వెంకీని చూస్తూ ఆనందించారు. సచిన్ సెంచరీ దిశగా పయనిస్తూ దుమ్ము దులుపుతుండడంతో ఫైనల్ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ విజయం దిశగా పరుగులు పెడుతోంది.



