విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య కలిసి నటిస్తున్న వెంకీ మామ చిత్రం ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే తన తరువాతి సినిమాగా తమిళంలో ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం, అసురన్ ను తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నట్టు ప్రకటించారు. కాంత్ అడ్డాల డైరెక్టు చేస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్కు పూర్తి అయ్యిందట.
గతంలో ఆయన వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు పని చేశారు. ఇక పోతే అసురన్ స్క్రిప్ట్ కు స్వల్ప మార్పులు మన నేటివిటీకి తగ్గట్టుగా చేశారట. వచ్చే నెలలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. నాన్ స్టాప్ గా సింగల్ షెడ్యూల్ లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసి వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రణాళికతో ఉంది.
ఇది ఇలా ఉండగా అసురన్ రీమేక్ తరువాత వెంకటేష్ తరుణ్ భాస్కర్ చిత్రంలో నటించబోతున్నారట. ఆ తరువాత త్రినాథ రావు నక్కిన డైరెక్షన్లో నటించబోతున్నారు. తరుణ్ భాస్కర్ తో హార్స్ రేసింగ్ మీద సినిమా తీస్తారని సమాచారం. దీని కోసం వెంకటేష్ హార్స్ రైడింగ్ కూడా ప్రాక్టీస్ చెయ్యబోతున్నారట.
ఆ సినిమా తరువాత త్రినాధ్ సినిమాలో పోలీసు పాత్రలో ఆయన కనిపిస్తారని అంటున్నారు. మొత్తానికి వెంకటేష్ తన తదుపరి చిత్రాలలో మూడు విభిన్నమైన పాత్రలలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.





