విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య నటించిన వెంకీ మామ 13న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చివరి నిముషంలో సినిమా రిలీజ్ ను ప్రకటించినా ప్రమోషన్స్ గట్టిగా చెయ్యడంతో సినిమాకు మంచి బజ్ వచ్చింది. అక్కినేని – దగ్గుబాటి కంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కాగా దీనిపై ఆయా కుటుంబాల వైఖరి కొంత చిత్రంగా ఉందనే చెప్పుకోవాలి.
సహజంగా అక్కినేని కుటుంబంలో ఎవరి సినిమా విడుదలైన మొత్తం కుటుంబం ఆ సినిమా ఫంక్షన్లకు హాజరు అవుతుంది. అయితే వెంకీ మామకు ఇప్పటికీ రెండు ఫంక్షన్లు జరిగాయి. ఒకటి ఖమ్మం ఇంకొకటి హైదరాబాద్ లో. అయితే రెండు ఫంక్షన్లకు అక్కినేని కుటుంబం నుండి ఎవరూ హాజరు కాలేదు. కనీసం సమంత కూడా రాకపోవడం విశేషం.
సమంత ఈ సినిమాకు అంతంతమాత్రంగానే ప్రమోషన్స్ చేస్తుందని అక్కినేని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. అయితే దగ్గుబాటి సైడ్ కథ మాత్రం పూర్తిగా వేరేగా ఉంది. సురేష్ బాబు గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. గతంలో వెంకటేష్ సినిమాలకు గానీ, కొడుకు రానా సినిమాలకు గానీ ఇంతలా ప్రమోషన్స్ చెయ్యలేదు.
ఒక్క వారం గ్యాప్ మాత్రమే ఉన్నా సినిమాకు పబ్లిసిటీ ద్వారా మంచి బజ్ తప్పించారు. అక్కినేని కుటుంబం కూడా ఇంవోల్వ్ అయితే సినిమాకు మరింత హైప్ వచ్చేది. ఇది ఇలా ఉండగా ఇటీవలే వేసిన సినిమా స్పెషల్ షోకు కూడా కేవలం దగ్గుబాటి ఫ్యామిలీ మాత్రమే అటెండ్ అయ్యింది.





