హ్యాకింగ్ కు గురైన సెలబ్రిటీ ఖాతా!

vidyullekha raman - facebook hackedతెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటిగా తనదైన ముద్ర వేసుకున్న నటి విద్యుల్లేఖ ఫేస్‌ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురయ్యింది. ఇందులో ఆమెకు సంబంధలేని ఫొటోలు, వీడియోలను అందులో పోస్టు చేయగా, తన ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురైనట్లు విద్యుల్లేఖ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.

తనకో విచిత్రమైన, భయంకరమైన అనుభవం ఎదురైందని పేర్కొంటూ తన ఫేస్‌ ‌బుక్ ఖాతా హ్యాక్ అయిన విషయాన్ని వెల్లడించింది. తన పేజీని తానే నిర్వహించుకుంటున్నా ఇదెలా జరిగిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఖాతా హ్యాక్‌ కు గురైన విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు వివరించింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories