విజయ్ దేవరకొండ నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడు?

Vijay Deverakonda Dear Comrade movie release2018 విజయ్ దేవరకొండ కెరీర్ ను మరో మలుపు తిప్పిన ఏడాదిగా పేర్కొనవచ్చు. ‘అర్జున్ రెడ్డి’తో వచ్చిన క్రేజ్ ను ‘గీత గోవిందం’తో పదింతలు చేసుకున్న విజయ్, తాజాగా ‘టాక్సీవాలా’తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. డిఫరెంట్ క్యారెక్టర్లను ఎంచుకుంటూ సాగిపోతున్న విజయ్ తదుపరి సినిమా ఏంటి? ఎప్పుడు రిలీజ్? అన్న ఆసక్తి ప్రేక్షకులలో కలగడం సహజమే.

[m9ad]

ADVERTISEMENT

ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా పేరు “డియర్ కామ్రేడ్.” భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ స్టైల్ లోనే ‘రా అండ్ రియలిస్టిక్’గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సెకండాఫ్ లో విడుదల చేయడానికి ప్లానింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరో విజయ్ దేవరకొండ మరో సినిమాను చూడాలంటే ఏడెనిమిది నెలల సమయం పడుతుందన్న మాట.

‘గీత గోవిందం’ ఫేం రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు విజయ్ దేవరకొండ స్టైల్ లోనే ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అలాగే తొలిసారిగా ఆంధ్రా స్టైల్ లో తన వాయిస్ ను విజయ్ చెప్పబోతున్నాడు. ఈ ఏడాది మూడు సినిమాలు విడుదల చేసి మురిపించిన విజయ్, వచ్చే ఏడాదికి ఒక్క సినిమానే ప్లాన్ చేయడం అంటే… అభిమానులకు రుచించే అంశం కాదు కదా!

ADVERTISEMENT
Latest Stories