విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో సినిమా ఎలా ఉన్నప్పటికీ, డీసెంట్ రివ్యూస్ వచ్చాయి. కనీసం ఆన్ లైన్ వరకూ అతికొద్ది నెగటివిటీ మాత్రమే ఉందని చెప్పుకోవాలి.
సినిమాలో ఉన్న ఇష్యూస్ ఇప్పటికే M9.News రివ్యూ లో డిస్కస్ చేశాం. అయితే ఈ సినిమాకు ఆన్ లైన్ లో చాలా వరకూ డీసెంట్ గా వర్డ్ ఆఫ్ మౌత్ రావడానికి గల కారణాలు ఏంటి?
సినిమా జోనర్ పెద్దగా నెగటివ్ మాట్లాడుకునే స్కోప్ ఇచ్చేది కాదు. ఇటువంటి సినిమాలు నచ్చకపోయినా పెద్దగా క్రిటికల్ అనాలిసిస్ చేసి దానిని చీల్చి చెండాడేవి కాదు. పైగా మ్యూజిక్, విజువల్స్, పెర్ఫార్మన్స్… లాంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
అయితే విజయ్ దేవరకొండ తన సినిమాలను ఒకరకమైన హడావిడితో ప్రమోట్ చేసేవాడు. ఆ ప్రమోషన్ వల్ల విసిబిలిటీ వచ్చినా అంతే స్థాయిలో నెగటివిటీ కూడా వచ్చేది. చాలా మంది ‘అతి’ చేస్తున్నాడు అని అతని మీద కసి పెంచుకునేవాళ్ళు.
లైగర్ అప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఈసారి మాత్రం విజయ్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు.
లైగర్ ప్లాప్ అయినప్పటి నుండీ మెయింటైన్ చేసిన సైలెన్స్ తో ట్రాల్స్ రాడార్ నుండి కొద్దిగా బయటపడ్డాడు. సినిమా జోనర్, రిలీజ్ ముందు సైలెన్స్ హెల్ప్ అయ్యి సినిమాని మరీ క్రిటికల్ గా చూసి ఎక్కెయ్యడం లాంటివి చెయ్యనివ్వలేదు.
అయితే విజయ్ సైలెన్స్ అంటే టోటల్ గా సినిమా ని సైలెంట్ చేసేసి… ప్రమోషన్స్ ఆపేశారు. అది సినిమాని ఓపెనింగ్స్ అలాగే సినిమా మీద ఉన్న బజ్ ని దెబ్బ కొట్టే స్థాయికి వెళ్లడం ట్రాజెడీ.
సైలెంట్ గా ఉంటేనే సినిమాను బాగా ప్రమోట్ చేసుకునే దారి ఒకటి చూసుకోవాలి విజయ్.



