సర్కారు పాటకి విజయసాయి బాగానే కనెక్ట్ అయ్యారే?

Vijay Sai Reddy comments on Sarkaru Vaari Paataమహేష్ బాబు నటించినసర్కారువారి పాట సినిమాపై సినీ విశ్లేషకులు రివ్యూలు వ్రాయడం పూర్తయింది. ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా దానిపై తన అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేశారు.

“సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం సర్కారువారి పాట బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు,” అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. చివరిలో మహేష్ ‘బాబు ఆల్ ది బెస్ట్’ అని అభినందనలు కూడా తెలిపారు.

ADVERTISEMENT

సాధారణంగా రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడే విజయసాయి రెడ్డి మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట గురించి తన అభిప్రాయం ట్విట్టర్‌లో షేర్ చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

సినిమా రిలీజ్‌కు ముందు మహేష్ బాబు “ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి చాలా మంచివారు, నిరాడంబరంగా ఉంటారు,” అంటూ పొగడటమే దీనికి కారణం కావచ్చు. ఏపీ సర్కార్ తెలుగు సినీ పరిశ్రమపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తుండటంతో మహేష్ బాబు తన సర్కారువారి పాటను ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బంది లేకుండా పాడుకోవడానికి సిఎం జగన్మోహన్ రెడ్డిని పొగిడినందున, ఆ సినిమాకు విజయసాయి రెడ్డి ఈవిదంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేరనుకోవచ్చు. ఇదీకాక, విజయసాయి రెడ్డికి కొట్టిన పిండివంటి అంశాలను సర్కారువారి పాటలో చూపడంతో ఆ సినిమాతో ఆయన బాగానే కనెక్ట్ అయినట్లున్నారు.

సర్కారువారి పాటకు మిశ్రమ స్పందన వస్తున్న ఈ సమయంలో విజయసాయి రెడ్డి చేసిన ఈ చిన్న ట్వీట్ చూసి వీర విధేయ వైసీపీ శ్రేణులు థియేటర్లకు క్యూ కడితే కలెక్షన్ల కనక వర్షం కురుస్తుంది. సినీపరిశ్రమకు మోకాలు అడ్డకుండా కనీసం ఈ మాత్రం మేలు చేయగలిగితే చాలు.

ADVERTISEMENT
Latest Stories