
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా ‘అతడు’ తెలుగు సినిమా చరిత్రలో ఒక ‘క్లాసిక్’ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా విడులయ్యి ఇప్పటికి 19 ఏళ్ళు పూర్తయినప్పటికీ బుల్లితెర మీద ఈ సినిమా కనిపిస్తే మళ్ళీ వీక్షించే ప్రేక్షకుల సంఖ్య అదే స్థాయిలో కొనసాగుతుంది అంటే అతి శయోక్తి కాదు.
అతడు సినిమాకు అటు మహేష్ బాబు అభిమానులలోనే కాదు ఇటు సాధారణ ప్రేక్షకులలోను, సినీ సెలబ్రెటీలలోనే అభిమానులున్నారు అనేది వాస్తవం. దర్శకుడు త్రివిక్రమ్ టేకింగ్, హీరో మహేష్ సెటిల్ యాక్టింగ్, త్రిష అమాయకత్వం, మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్ గా చెప్పవచ్చు.
Also Read – పవన్ కోసం దర్శక నిర్మాతల ఎదురుచూపులు
అయితే తాజాగా ఈ సినిమా పై ఒక తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. తానూ కష్టాలలో ఉన్న సమయంలో అతడు సినిమాను రిపీట్ మోడ్ లో పెట్టుకుని మరి చూశానని, ఈ సినిమాకు నేను చాల పెద్ద ఫ్యాన్ ను అంటూ ఒక ఇంటర్ వ్యూ లో వెల్లడించారు.
ఈ మూవీలో భావోద్వేగాలను దర్శకుడు త్రివిక్రమ్ అద్భుతంగా చిత్రీకరించారని, మహేష్, త్రిషల మధ్య సన్నివేశాలు అందగా సృష్టించారంటూ దర్శకుడి ప్రతిభను, మహేష్ నటనను కొనియాడారు. అలాగే ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ తనకు చాల ఇష్టమని, సినిమా ఎంట్రీ నుండి క్లైమాక్స్ వరకు తనకు సీన్ టూ సీన్ గుర్తుందని చెప్పారు.
Also Read – జమ్ము కశ్మీర్‌కి ప్రజా ప్రభుత్వాలు పనికిరావేమో?
దీనితో విజయ్ సేతుపతి మాట్లాడిన ఈ వీడియో ను సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి విలక్షణ నటనకు తెలుగు ఆడియన్స్ లో కూడా పెద్ద ఎత్తున ఆయనకు అభిమానులున్నారు. వారు సైతం విజయసేతుపతి వ్యాక్యలను అభినందిస్తున్నారు.
స్వతహాగా తమిళ నటుడైనప్పటికీ ఒక తెలుగు సినిమా పై అది సినిమా విడుదలైన 19 ఏళ్ళ తరువాత ఆ సినిమాను ప్రశంసించడం విజయ్ మంచి మనస్సుకు నిదర్శనం అంటున్నారు. మొత్తానికి ‘అతడు’ ‘అతడినీ’ మెప్పించిందన్న మాట.