తమిళనాడు ఎన్నికల ఫలితాల తరువాత విజయ్ టీవీకే పార్టీ గెలుపును ఆ పార్టీ అభిమానులు జరుపుకున్న దానికంటే కాస్త అధికంగానే వైసీపీ జరుపుకుందేమో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
విజయ్ తో జగన్ ను సరిపోల్చుతూ సింహం సింగల్ అంటూ సినిమాటిక్ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ వైసీపీ శ్రేణులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే నగరి రోజా అయితే ఒక అడుగు ముందుకేస్తూ నిన్నటి వరకు స్టాలిన్ డీఎంకే కు మద్దతిస్తూ చేసిన ప్రకటనలను పక్కన పెట్టి మరి విజయ్ గెలుపును భుజాన కెత్తుకున్నారు.
విజయ్ తన ఎన్నికల ప్రచారంలో జగన్ ఫోటో పట్టకోవడం విజయ్ టీవీకే పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిందంటూ విజయ్ పేరు చెప్పుకుంటూ జగన్ భజన మొదలుపెట్టారు. అయితే అసలు విజయ్ గెలుపుకి జగన్ విజయానికి పోలిక ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో వైసీపీ పై గట్టి ట్రోలింగ్ నడిచింది.
విజయ్ తన కార్ డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే జగన్ తన కార్ డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికీ ఎమ్మెల్సీ ఇచ్చారంటూ, విజయ్ కి జగన్ మాదిరి సాక్షి మీడియా లేదని, జగన్ మాదిరి విజయ్ కి కోడికత్తి కేసులు, గొడ్డలి వేటు కథలు తెలియవని…ఇలా పలురకాలుగా వైసీపీ ని సోషల్ మీడియాలో రోస్ట్ చేసేసారు.
ఇక ఇప్పుడు విజయ్ అసెంబ్లీ లో ఎమ్మెల్యే ల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ముగించుకుని మాజీ ముఖ్యమంత్రి, టీవీకే రాజకీయ ప్రధమ ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకే అధినేత స్టాలిన్ ఇంటికి వెళ్లారు. ఎన్నికలలో డీఎంకే పార్టీ పై రాజకీయ యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఏకంగా పార్టీ అధినేతనే ఓడించిన విజయ్ రాజకీయాలను పక్కన పెట్టి మరి స్టాలిన్ ఇంటికి వెళ్లారు.
మరి జగన్ తనకు ముఖ్యమంత్రి పీఠం చేతికి అందిన మరుక్షణం సొంత తల్లిని, చెల్లిని కూడా రాష్ట్ర సరిహద్దులు దాటించేసారు. ఇక ప్రతిపక్ష నేతగా నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బాబును సైతం వ్యక్తిగతంగా టార్గెట్ చేసారు.
2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చాకా జగన్ ఎన్నడూ ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. మరి ఈ విషయంలో కూడా విజయ్ ను జగన్ తో వైసీపీ పోల్చుకుంటుందా.? అసలు జగన్ కు ఆ స్థాయి హుందా రాజకీయాలు చేసే పరిణితి ఉంటుందా.? ఎప్పటికైనా వస్తుందా.?




