విజయసాయి అప్పుడే వైసీపీలో తొలి వికెట్ తీశారుగా!

Vijayasai Reddy's New Party: YSRCP Leader Announces Exit

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రేపు అంటే నవంబర్‌ 11వ తేదీ ఉదయం 11.11 గంటలకు కొత్త పార్టీ ప్రకటించబోతున్నారు. కొత్త పార్టీ ప్రకటనకు అలాంటి ముహూర్తం పెట్టుకోవడం గమనిస్తే, ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఎంతగా రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.

అడపాదడపా మీడియా సమావేశాలు పెట్టి ‘శ్రీరంగ నీతులు’ చెపుతున్నారు. కానీ ఆయన కూడా వైసీపీని టార్గెట్ చేసుకొని బరిలో దిగుతున్నారని వేరే చెప్పక్కరలేదు. అయితే ఇంకా పార్టీ ప్రకటించక మునుపే ఆయన వైసీపీలో తొలి వికెట్ పడగొట్టారు.

ADVERTISEMENT

వైసీపీ సీనియర్ నాయకుడు అన్నప్ప రెడ్డి విజయభాస్కర్ రెడ్డి నేడు విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు, విజయసాయి రెడ్డి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా అయన కూడా విజయసాయి రెడ్డిలాగే ‘కోటరీ-సజ్జల’ అంటూ జగన్మోహన్ రెడ్డిపై అనేక విమర్శలు చేశారు. పార్టీలో ఎంత కష్టపడినా సముచిత గౌరవం లేకపోవడం వల్లనే వైసీపీని వీడుతున్నానని చెప్పారు.

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏడాదిన్నర కాలంలో చేయలేకపోయిన ఈ పనిని, విజయసాయిరెడ్డి ఇంకా పార్టీ ప్రకటన చేయక ముందే సాధించడం విశేషం.

కనుక ఆయన పార్టీ ప్రకటన చేసి గేట్లు తెరిస్తే వైసీపీలో ఇమడలేక ఇబ్బందిపడుతున్న సీనియర్ నేతలు విజయసాయి రెడ్డి పార్టీలోకి క్యూ కట్టే అవకాశం కనిపిస్తోంది. లేకుంటే ఒకప్పుడు సీఏ టాపర్ అయిన విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పెట్టేవారే కారు. ఇంత రిస్క్ తీసుకొని ఉండేవారే కారుకదా?

ADVERTISEMENT
Latest Stories