అప్పుడే కూటమి గెలుపు, వైసీపీ ఓటమి పరిపూర్ణం!

AP Panchayat elections and major political parties

రాజకీయ పార్టీల పరంగా జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీ వితండ వాదనలకు సీఎం చంద్రబాబు నాయుడు చెంపదెబ్బ కొట్టినట్టుగా ఖచ్చితమైన గణాంకాలతో జవాబు చెప్పారు.

వైసీపీ గెలిచిన చోట్ల ప్రజలు తమవైపే ఉన్నారని ఓడిపోయిన చోట టీడీపి దౌర్జన్యాలకు పాల్పడి గెలిచిందని జగన్‌ చెప్పుకోవడాన్ని సిఎం చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు.

ADVERTISEMENT

కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి, ఎన్నికలు సజావుగా నిర్వహించినందునే పులివెందుల ప్రజలు కూడా ఈసారి నిర్భయంగా ఓట్లు వేసి వైసీపీని ఓడించారు.

ఎన్నికలు సజావుగా సాగినందునే గన్నవరంతో సహా పలు ప్రాంతాల్లో వైసీపీ ఆ మాత్రం సీట్లు గెలుచుకోగలిగిందనే విషయం జగన్‌కు తెలియదనుకోలేము.

ఇప్పుడు పార్టీలు, వాటి అభ్యర్ధులు, వాటి ఎన్నికల గుర్తులు లేకుండా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ముందుగా ఎన్నికల షెడ్యూల్ వివరాలు:

నామినేషన్లు: నవంబర్‌ 13,16, 19. పోలింగ్: నవంబర్‌ 26,29, డిసెంబర్‌ 2వ తేదీలలో. పోలింగ్ పూర్తయిన వెంటనే సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

ఇవి గ్రామ స్థాయిలో జరుగుతున్న ఎన్నికలే అయినప్పటికీ గ్రామీణ ప్రజలు కూడా పార్టీల వారీగా చీలిపోయున్నారు. కనుక వీటిలో కూడా ఆయా పార్టీలకు చెందినవారే పాల్గొంటారనేది బహిరంగ రహస్యం.

ఈ లెక్కన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి, పంచాయతీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించడం ఖాయమే అని భావించవచ్చు. అప్పుడు కూటమి గెలుపు, వైసీపీ ఓటమి పరిపూర్ణం అవుతుంది.

ఈ ఎన్నికల్లో కూడా జనసేన సత్తా చాటుకుంటే, ఆ పార్టీ గ్రామస్థాయి వరకు విస్తరించి, ప్రజలను ప్రభావితం చేయగలుగుతోందని స్పష్టమవుతుంది. అప్పుడు జనసేనకు తిరుగు ఉండదు.

ADVERTISEMENT
Latest Stories