తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి’తో విస్తరింపజేసిన దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రానికి మూడవ పార్ట్‌ను కూడా తెరకెక్కించబోతున్నట్లుగా ఆ మధ్య ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ‘బాహుబలి’ రెండవ పార్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు రాజమౌళి. అతి త్వరలోనే రెండవ పార్ట్‌కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారు. అందుకోసం ప్రభాస్, రానా, తమన్నాలు సిద్దం అవుతున్నారు. ఇక రెండవ పార్ట్ షూటింగ్ ప్రారంభం అవ్వకుండానే మూడవ పార్ట్‌కు సంబంధించిన వర్క్ ప్రారంభం అయినట్లుగా రచయిత విజయేంద్ర ప్రసాద్ అధికారికంగా ప్రకటించాడు.
దర్శకధీరుడు రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తాను ‘బాహుబలి’ మూడవ పార్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాను అని అన్నాడు. ‘బాహుబలి’ మొదటి రెండు పార్ట్‌లతో ఈ మూడవ పార్ట్‌కు ఎలాంటి సంబంధం ఉండదు అని మరోసారి విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఎలాంటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతుంది అనే విషయాన్ని మాత్రం ఈయన చెప్పలేదు. పౌరాణిక నేపథ్యమా లేక జానపదమా లేక సాంఫీుకమా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. అయితే తక్కువ బడ్జెట్‌తో మాత్రం తెరకెక్కబోతున్నట్లుగా విజయేంద్ర వర్మ ప్రకటించాడు.





