మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తోన్న “విజేత” సినిమా నుండి మొదటి పాట ప్రేక్షకులను పలకరించనుంది. శుక్రవారం నాడు ఈ పాటను రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ నుండి ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఖరారు చేసారు. ఈకలు పీకేసిన కోడిని చూస్తూ ఏడుస్తున్న కళ్యాణ్ దేవ్ ఈ పోస్టర్ లో కనపడుతున్నాడు.
‘కోడికి సంతాపం – కో కొక్కొరోకో’ అనే ఈ పాటను శుక్రవారం ఉదయం 8.09 నిముషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్, టీజర్ అన్ని కూడా లో ప్రొఫైల్ లో సాగుతున్నాయి. టీజర్ అయితే మెగాస్టార్ ‘విజేత’కు రీమేక్ ఏమో అన్న సంకేతాలను ఇచ్చింది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ఆడియో విడుదల కానుంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



