అభివృద్ధి విషయంలో గత మూడేళ్ళుగా ట్రోలింగ్ కు గురవుతున్న వైసీపీ సర్కార్, మరోసారి అందుకు అవకాశం ఇచ్చినట్లయింది. రాజధానిగా అమరావతి అభివృద్ధి హాట్ టాపిక్ కావడంతో, గత మూడేళ్ళుగా జగన్ తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ సోషల్ మీడియాకు ఎక్కాయి. అందులో ప్రధానమైనది ఏమిటంటే… పులివెందుల బస్ స్టాండ్.
వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం అయిన పులివెందుల బస్ స్టాండ్ అత్యాధునికంగా మారుస్తానని చెప్పి, ప్రభుత్వం ఓ డిజైన్ ను కూడా సిద్ధం చేసింది. కానీ అప్పటి నుండి ఇప్పటివరకు పులివెందుల బస్ స్టాండ్ డిజైన్ కార్యరూపం దాల్చకపోగా, నాడు టీడీపీపై చేసిన ‘గ్రాఫిక్స్’ విమర్శలు, ప్రస్తుతం వైసీపీని వెంటాడుతున్నాయి.
ప్రస్తుతం సమ్మర్ వేడిని తాళలేక పులివెందుల బస్ స్టాండ్ తాటాకులతో నిర్మాణం జరుగుతోంది. ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాజధానిగా అమరావతి నిర్మాణం దేవుడెరుగు, కనీసం ఓ బస్ స్టాండ్, అది కూడా సొంత నియోజక వర్గంలో చేయలేని ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పేరు ట్రోలింగ్ కు గురవుతోంది.
నాడు జగన్ సర్కార్ ఇచ్చిన గ్రాఫిక్స్ పిక్ ఓ వైపు – ప్రస్తుతం పులివెందుల బస్ స్టాండ్ పిక్స్ మరో వైపు పెట్టి నెట్టింట టీడీపీ వర్గీయులు సందడి చేస్తున్నారు. అలాగే చంద్రబాబు సొంత నియోజక వర్గం అయిన కుప్పం బస్ స్టాండ్ మరియు పులివెందుల బస్ స్టాండ్ పిక్ పెట్టి తెలుగుదేశం వర్గీయులు చేస్తోన్న పిక్స్ కోకొల్లలు.
మా బాబాయ్ వచ్చాడు Aeroplane bus stand కడతాను అన్నాడు
కాని తడికల bus stand కట్టాడు
సామెత: పెద్ద పనోడు పందిరి వేస్తే పచ్చికలు పడగొట్టాయి అంట
“అట్లుంటది మా బాబాయ్ తోని” pic.twitter.com/MAudR3pMIz
— Geetha™️✌️ (@Geetha_Happy) April 3, 2022
కుప్పం బస్టాండు పులివెందుల బస్టాండ్ pic.twitter.com/zh9XlgWAJf
— Jayapal Reddy TDP (@JayapalReddyJPR) April 3, 2022
పులివెందుల బస్టాండ్ కు కుప్పం బస్టాండ్ వ్రాయునది ఏమనగా?
నన్ను దశాబ్దాల క్రితం ఎప్పుడో నిర్మించారు.
ఇలా ఆధునిక హంగులతో ఎయిర్పోర్టు లెక్క చేశారు.ఇక్కడి ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎన్నుకొంటున్న నాయుడు ఏదో ఇలా చేశారు.
నాకు ఆయన ఒక్కరే సీఎం.
నీకు ఇప్పటివరకు ఇద్దరు సీఎంలు. (1/2) pic.twitter.com/DaojaBgryD
— Sreenivas C (@SreenivasC14) April 3, 2022



