క్రికెట్ లో “బ్యాట్ మ్యాన్ – సూపర్ మ్యాన్” ఎవరో తెలుసా!

 Virat Kohli breaks Chris Gayle IPL batting recordచావో రేవో అంటూ బరిలోకి దిగుతున్న ప్రతిసారి ప్రత్యర్ధి బౌలర్లను తుక్కురేగ్గోట్టడం రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్ మెన్ల వంతవుతోంది. కోల్ కోతా జరిగిన మ్యాచ్ లో 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి, మరో 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. ప్రత్యర్ధి జట్టును బెంబేలేత్తించే బ్యాటింగ్ దిగ్గజాలు మరోసారి తమ బ్యాట్ కు పని చెప్పడంతో భారీ లక్ష్యం కూడా వారి ప్రతిభ ముందు చిన్నబోయింది.

ఈ సీజన్లో అసలు ఫాం ప్రదర్శించనటువంటి క్రిస్ గేల్ 31 బంతుల్లో 49 పరుగులు చేసి ఫాంలోకి రాగా, మరోసారి కోహ్లి – డివిలియర్స్ ద్వయం మ్యాచ్ ను విజయవంతంగా ముగించారు. 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి తన యంత్రానికి అలుపు లేదని చాటిచెప్పగా, 31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసాడు డివిలియర్స్. భారీ లక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి అందుకోవడంతో కోల్ కతా కెప్టెన్ గంభీర్ అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT

మ్యాచ్ ముగిసిన తర్వాత ‘విరాట్ కోహ్లి – డివిలియర్స్’ ద్వయాన్ని ‘బ్యాట్ మ్యాన్ – సూపర్ మ్యాన్’గా కొనియాడాడు క్రిస్ గేల్. ఈ మ్యాచ్ గెలుపుతో ప్లే ఆఫ్స్ ఆశలను ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. 12 మ్యాచ్ లలో 12 పాయింట్లు సాధించి పోటీలో నిలిచింది. మిగిలిన 2 మ్యాచ్ లలో కూడా విజయం సాధిస్తే ఏకంగా టాప్ 2లో చోటు దక్కే అవకాశాలు బెంగుళూరు జట్టుకు పుష్కలంగా ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories