సోషల్ మీడియా దెబ్బకి షేప్ అవుట్ అయిపోయిన హీరో

Vishwaksen Naidu fires on negative comments on Falanuma das movieఅవసరం ఉన్నా లేకున్నా.. సినిమాలో బూతు డైలాగ్‌లు ఉంటే అదో గొప్ప అనుకున్నట్టుగా తీసిన సినిమా ఫలక్నుమా దాస్. మొదట్లో ఇది సినిమాకు కొంత క్రేజ్ తెచ్చిపెట్టిన విడుదల తరువాత సినిమా పై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే ఎవడి సినిమాకి ఆడే హీరో కాబట్టి తన సినిమా బాలేదన్నందుకు బూతులతో నోటికి పని చెప్పాడు ఈ సినిమా హీరో విశ్వక్ సేన్. నిజజీవితంలో కూడా సినిమాను విమర్శించిన వారి పై అవే బూతులు వాడేశారు మన హీరో గారు.

హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ల సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇస్తూ… సినిమా బాలేదని కామెంట్ చేసిన వారిపై విశ్వక్ సేన్ బూతుల వర్షం కురిపించాడు. సినిమా విడుదలకు ముందు నుండి విజయ్ దేవరకొండ ను టార్గెట్ చేశాడు ఎందుకనో. దీనిపై సోషల్ మీడియా లో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. విశ్వక్ సేన్ నోటి దురుసుపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. చెత్త సినిమా తీసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న విశ్వక్ సేన్‌ని ట్రోల్ చేశారు. వారి ఫైర్ కి భయపడ్డాడో లేక ఇండస్ట్రీ నుండి ఎవరైనా తల అంటారో తెలీదుగానీ ఆయన మొత్తానికి దిగి వచ్చారు.

ADVERTISEMENT

“ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలంటారు.. ఆ నేచర్ నాకు కాస్త తక్కువగా ఉంది. నేను ఏదో కోపంతో మాట్లాడిన దాన్ని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది నా పర్సనల్ వీడియో. మీడియాను ఉద్దేశించి ఏమీ అనలేదు. రివ్యూలకు కొంతమంది తక్కువ రేటింగ్ ఇచ్చినా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఎవరి టేస్ట్ వారిదని లైట్ తీసుకున్నా. ఆడియో లాంచ్ సమయంలో మాట్లాడిన మాటలు ఒక హీరోను ఉద్దేశించి అని అంతా అనుకుంటున్నారు. నేను ఏ హీరోను ఉద్దేశించి అనలేదు. ఆ మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు. వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే సారీ చెబుతున్నా,” అన్నాడు ఆయన.

ADVERTISEMENT
Latest Stories