టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వినాయక్ తాజాగా నితిన్ నిర్మాణంలో ‘అఖిల్’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమాపై మొదటి నుండి కూడా అంచనాలు తారా స్థాయిలో వచ్చాయి. దాంతో ఆ అంచనాలను అందుకోవడం కోసం దర్శకుడు వినాయక్ భారీగా ఖర్చు చేసి ‘అఖిల్’ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. చివరికి వచ్చే సరికి బడ్జెట్ తడిసి మోపెడు అయ్యింది. అయినా కూడా ఏమాత్రం ఆందోళన చెందకుండా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోషన్ చేశారు. అందువల్ల డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకుని కోట్లు పెట్టి ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగింది. తీరా చూస్తే సినిమా ఫలితం ఫ్లాప్ అయ్యింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లు కోట్లలో నష్టపోయారు.
ఈ సినిమాను చేసేందుకు వినాయక్‌కు 12 కోట్ల పారితోషికాన్ని ఇచ్చేందుకు నిర్మాత నితిన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. సినిమా విడుదల ముందు 8 కోట్లు వినాయక్ తీసుకోగా, మిగిలిన 4 కోట్లను విడుదల తర్వాత ఇస్తాను అంటూ నితిన్ హామీ ఇచ్చాడు. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ బ్యాలన్స్‌ను ఇవ్వడం తన వల్ల కాదు అంటూ నితిన్ చేతులెత్తేస్తున్నాడు. నితిన్ ఇచ్చే ఆ మొత్తాన్ని వినాయక్ డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలని భావిస్తున్నాడు. కాని నితిన్ మాత్రం తన వల్ల కాదు అంటూ చెప్పడంతో, వినాయక్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. దర్శకుల మండలిలో నితిన్‌పై ఫిర్యాదు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నాడు. పెద్దలు ప్రస్తుతం ఈ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇది చివరకు ఎటు దారి తీస్తుందో చూడాలి.





