థర్డ్ ఎంపైర్ నిర్ణయం… విండీస్ పాలిట వరం..!

West Indies won T20 world cup 2016టీ-20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవడానికి 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టీండీస్ జట్టు 4 ఓవర్లు ముగిసే సమయానికి 21 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. అయితే తదుపరి ఓవర్లో నాలుగు బౌండరీలు బాది ఇంగ్లాండ్ కు ప్రమాద ఘంటికలు మ్రోగించే విధంగా శామ్యూల్స్ బ్యాటింగ్ తీరు ఉంది. అయితే 6 ఓవర్ తొలి బంతికి వికెట్ కీపర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ వైపుకు శామ్యూల్స్ అడుగులు పడ్డాయి. ఇక్కడే పడింది అసలు ‘ట్విస్ట్…’

మైదానం వదులుతున్న శామ్యూల్స్ ను ఆగాల్సిందిగా ఎంపైర్లు కోరడంతో విషయం థర్డ్ ఎంపైర్ దగ్గరకు వెళ్ళింది. శామ్యూల్స్ బ్యాట్ ను తాకుతూ వెళ్ళిన బాల్ ను కీపర్ క్యాచ్ అందుకోబోయే ముందు నేలపై పడడం స్పష్టంగా కనపడింది. దీంతో ఎంపైర్ నాటౌట్ ను ప్రకటించడంతో మళ్ళీ తిరిగి క్రీజులోకి చేరుకున్నాడు శామ్యూల్స్. ఈ ఉదంతం అంతా చూస్తున్న ఇండియా – విండీస్ ల మధ్య జరిగిన మ్యాచ్ ఉదంతాలు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. అయితే తాము శామ్యూల్స్ కారణంగా ఓటమి పాలవుతామని ఇంగ్లాండ్ టీంకు తెలియక పోయినా భారత అభిమానులకు మాత్రం ఒక స్పష్టత వచ్చేసింది.

ADVERTISEMENT

తీరా సీన్ కట్ చేస్తే… ఇండియాను ఓడించడంలో సిమ్మన్స్ పోషించిన అదే పాత్రను ఇంగ్లాండ్ విషయంలో శామ్యూల్స్ పోషించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 66 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్ విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. అయితే చివరి ఓవర్లో 19 పరుగులు కావాల్సిన సమయంలో స్టోక్స్ వేసిన మొదటి నాలుగు బంతులను నాలుగు సిక్సర్లుగా మలిచి ఇంగ్లాండ్ ఆశలను ఆవిరి చేసిన ఘనత బ్రెత్ వైట్ సొంతం చేసుకున్నాడు. టీ 20 క్రికెట్ లో తమకు ఎదురులేదనే విధంగా రెండు సార్లు కప్ ను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు. మరో విశేషమేమిటంటే… అంతకుముందు జరిగిన మహిళల ఫైనల్స్ లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి విండీస్ మహిళా విభాగం కూడా ప్రపంచ కప్ ను తమ దేశానికి సగర్వంగా తీసుకువచ్చారు.

ADVERTISEMENT
Latest Stories