“వాలైంటైన్స్ డే” రోజు రానా చేయబోతున్న చిలిపి పనులేంటి?

what rana is doing on valentines day feb 14ప్రేమికుల దినోత్సవం రోజు దగ్గుపాటి రానా అలియాస్ భళ్ళాలదేవుడు ఏం చేయబోతున్నారు? ఇదే సందేహం అల్లు శిరీష్ కు కూడా వచ్చింది. అందుకే రానాను వాట్సప్ లో ప్రశ్నించాడు. “14వ తేదీన ఏం చేయబోతున్నావ్? అని శిరీష్ అడుగగా, ఆ తేదీ ఏ రోజున వచ్చింది? అని రానా అడగడం… మళ్ళీ దానికి శిరీష్ ‘ఆదివారం’ అంటూ బదులివ్వడం జరిగింది. అలాగా… అయితే ఆ రోజు షోల్డర్ + బైసిప్స్ వర్కౌట్ చేయబోతున్నా… అంతే..!” అంటూ రానా ఇచ్చిన చమత్కారపు సమాధానంతో కూడిన వాట్సప్ ఇమేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

అయితే ఈ ఫోటోను అటు అల్లు శిరీష్ గానీ, ఇటు రానా గానీ షేర్ చేసుకోకుండానే ట్విట్టర్ లో సందడి చేస్తోంది. దీంతో సినీ అభిమాన వర్గం ఇది నిజమో కాదో అన్న సందేహం వ్యక్తపరుస్తున్న సమయంలో సీన్ లోకి సుధీర్ బాబు ఎంటర్ అయ్యారు. “నేను కూడా మీతో జాయిన్ అవుతానంటూ…” సుధీర్ మరో ఛలోక్తి విసరడంతో బహుశా ఇది అల్లు శిరీష్ – రానాల మధ్య జరిగిన చాటింగే అయ్యుంటుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. నిజమైనా… అబద్ధమైనా జోక్ అయితే అదిరిపోయింది అంటున్నారు నెటిజన్లు!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories