jagan-nagarjuna-yadav-yanamala

చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి దుర్మార్గపు పనులు అనే సామెతకు పూర్తి న్యాయం చేసి చూపిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్. తానూ అధికారంలో ఉన్నప్పుడు ఒప్పైనా నీతి జగన్ కు ఇప్పుడు తప్పుగా కనిపిస్తుందట.

Also Read – జమ్ము కశ్మీర్‌కి ప్రజా ప్రభుత్వాలు పనికిరావేమో?

గతం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ మీద విమర్శ చేసిన నేరానికి టీడీపీ జాతీయ ప్రతినిధి పట్టాభి ని అరెస్టు చేసి వైసీపీ ట్రీట్మెంట్ ఇచ్చి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడింది వైసీపీ ప్రభుత్వం.

అయితే ఇదంతా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కే అంటూ, నన్ను విమర్శిస్తే నా పార్టీ క్యాడర్ కు బీపీలు రావడం దాడులు చేయడం సహజమే అంటూ నాడు హింసను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన జగన్ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో శుద్ధ ప్రవచనాలు వల్లెవేస్తున్నారు.

Also Read – మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా?

ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పై హత్య ప్రయత్నం చేస్తాను అంటూ పరోక్షంగా మీడియా సాక్షిగా హెచ్చరించిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఒక ముఖ్యమంత్రిని చంపుతా అంటూ బెదిరించిన నేరానికి గాను సదరు వైసీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసారు నాగార్జున.

Also Read – విద్యార్థుల ఆత్మహత్యలు…పాపం ఎవరిదీ.?

ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తేనే అరెస్టు చేసి లాఠీకి పనిచెప్పిన వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి బాబు ప్రాణాలను ఆ ఏడూ కొండలవాడు కూడా కాపాడలేడు అంటూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించిన నాగార్జున యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని వైసీపీ తప్పుబడుతూ తన సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేసింది.

కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన నెల రోజులలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయ్యిందంటూ, శాంతి భద్రతలు మంట కలిసిపోయాయంటూ నానా యాగీ చేస్తుంది వైసీపీ. అసలు జగన్ ఉన్న చోట ప్రజాస్వామ్యానికి చోటు ఉంటుందా? ఉంటే గత ఐదేళ్లల్లో ఏపీలో జరిగిన విధ్వంసానికి ఏ పేరు పెట్టాలి?

వ్యక్తిగత గొడవలను తీసుకొచ్చి రాజకీయ రంగు పూసి తమ పార్టీని బలపరుచుకోవడానికి రాష్ట్ర ప్రతిష్టను ఢిల్లీ విధుల్లో దిగజార్చడానికి సైతం వెనుకాడని జగన్ మనస్తత్వాన్ని ఏమని వర్ణించాలి? వైసీపీ ప్రభుత్వంలో సొంత చెల్లికి తల్లికే రక్షణ కల్పించలేని జగన్ ఇప్పుడు శాంతి భద్రతల అంశాన్ని భుజానికెత్తుకోవడాన్ని ఏ వ్యూహంలో భాగమనాలి?




జగన్ రాష్ట్రంలో బయటకొచ్చి వేసే ప్రతి అడుగు రాష్ట్ర ప్రతిష్టను వెనక్కిలాగిన్నట్టే అంటూ గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజమని జగన్ తన చర్యలతో నిరూపిస్తున్నారు.