
తెరాస నుంచి బిఆర్ఎస్ గా మారిన పార్టీని ఇంతకాలం తన రాజకీయ వ్యూహాలతో ముందుకు తీసుకువెళ్లిన కేసీఆర్ ఇప్పుడు పార్టీ ఓటమి బాధను ఒక వైపు ,విరిగిన తుంటి ఎముక బాధను మరో వైపు మోస్తూ ఇంటికే పరిమితమయ్యారు.
ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు మోస్తూ పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను సిద్ధం చేసి పార్టీని ప్రజల ముందుకు తీసుకు వచ్చే బాధ్యతను కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ తీసుకుంటారా..? లేక ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో పాటుగా పార్టీకి అండదండగా ఉంటున్న సీనియర్ లీడర్ కేసీఆర్ బావమరిది హరీష్ రావు అందుకుంటారా.? లేక ఆరోగ్యం సహకరిస్తే కేసీఆరే నాయకత్వ బాధ్యతలను తీసుకుంటారా.? అనేది చర్చనీయాంశమయ్యింది.
పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి పోటీ చేసే స్థానాల వరకు అంతిమ నిర్ణయాధికారం కేసీఆరే తీసుకున్నప్పటికీ పార్టీని, పార్టీ తరుపున ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థిని విజయం దిశగా తీసుకువెళ్ళడానికి చేపట్టే ప్రచార కార్యక్రమాల బాధ్యత నుంచి కొత్తగ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొడుతూ తీసుకోవాల్సిన చర్యల వరకు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది.
కేసీఆర్ తన వాగ్దాటితో సొంత పార్టీ నేతలనే కాదు ప్రత్యర్థి పార్టీ నాయకులను కూడా కట్టడి చేయడంలో ఆరితేరిన వాడు. ఎప్పుటికప్పుడు తన రాజకీయ వ్యూహాలను మార్చుకుంటూ ప్రత్యర్థి పార్టీలను ఇరుకునపెట్టగల సమర్థత కేసీఆర్ లో ఉంది. ఆలోచనతో కూడిన ఆవేశంతో రాజకీయాలను ముందుకు తీసుకువెళతారు కేసీఆర్. తుంటికి జరిగిన శస్త్ర చికిత్సతో బెడ్ రెస్టులో ఉన్న కేసీఆర్ ఇప్పుడీ ప్రచార బాధ్యతలు తీసుకుంటారా.?అంటే కాదనే సమాధానమే వినపడుతుంది.
కేటీఆర్ మంచి వాగ్ధాటి ఉన్న క్లాస్ పొలిటీషియన్ అనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. కానీ కేసీఆర్ కు ఉన్నంత రాజకీయ అనుభవం కానీ మాస్ లీడర్ షిప్ క్వాలిటీస్ కానీ కేసీఆర్ తో పోలిస్తే కేటీఆర్ కు కాస్త తక్కువనే చెప్పాలి. పక్క పార్టీ నాయకులను కూడా కట్ఠడి చేయగలిగేంత ఆవేశం కూడా కేటీఆర్ లో కనపడదు. అలాగే హరీష్ రావు విషయానికి వస్తే., అసలు కేటీఆర్ తోనే సఖ్యత మైంటైన్ చేయడానికి ఇబ్బంది పడే హరీష్ పార్టీ నేతలందరినీ ఒక తాటిమీదకు తీసుకురాగలుగుతారా.?అంటే సందేహమే.
బిఆర్ఎస్ పార్టీలోనే తన సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న హరీష్ రావు ఆదేశాలను పార్టీలోని నేతలంతా అంగీకరిస్తారా.? పదేళ్ల అధికార దర్పాన్ని అనుభవించిన బిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఆ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండగలరా..? తమ నియోజకవర్గ అభివృద్ధి అంటూ పక్క పార్టీల కండువాలు కప్పుకుంటానికి సిద్ధంగా ఉన్న నాయకులను కట్ఠడి చేయాలిగేంత నేర్పు ఈ ఇద్దరి నేతలలో ఉందా.? అనేది కాలమే సమాధానం చెప్పాలి.
SS Rajamouli has conquered box-office records with larger-than-life storytelling. But there is one thing that…
Following the terrible failure of Toxic, Yash has still not announced his next solo lead…