YS_Jagan_Vizag_Steel

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌ వలననే ఇటు గాజువాక నుంచి అటు అనకాపల్లి వరకు శరవేగంగా అభివృద్ధి చెందింది. స్టీల్ ప్లాంట్‌ ఉద్యోగులు, వారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు వగైరా అమ్ముకొని జీవిస్తున్నవారు వేలమంది ఉన్నారు.

Also Read – జగన్‌తో సహవాసం.. ముగింపు ఇలాగే!

అటు విజయవాడ నుంచి ఇటు శ్రీకాకుళం వరకు పరిశ్రమలు, భవన నిర్మాణాలకు అవసరమైన ఉత్పత్తులను వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ అందిస్తోంది. ఇంత ప్రాముఖ్యత గల వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ వివిద కారణాల వలన నష్టాలలో నడుస్తోంది.

లాభాలలో నడిచినంత కాలం దాని నుంచి ఫలాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడది నష్టాల బారిన పడగానే ఓ గుదిబండలా భావిస్తూ ప్రైవేట్ సంస్థలకు అమ్మేసేందుకు నిశబ్ధంగా పావులు కదుపుతోంది.

Also Read – విద్యార్థుల ఆత్మహత్యలు…పాపం ఎవరిదీ.?

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తో ఆంధ్రా ప్రజలకు ముఖ్యంగా విశాఖ, ఉత్తరాంధ్రా జిల్లాల ప్రజలకు ఉన్న సెంటిమెంటుని కేంద్రం , జగన్‌ కూడా గుర్తించలేకపోయారు. ప్రయివేటీకరణ ప్రక్రియ జరుగుతుంటే తెలియన్నట్లు ఊరుకున్నారు.

కానీ తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ గుర్తించి దానిని తెలంగాణ ప్రభుత్వం లేదా సింగరేణి ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. తద్వారా ఏపీలో బిఆర్ఎస్ పార్టీ బలమైన అడుగు వేసేందుకు అది ఎంతగానో తోడ్పడుతుందని భావించారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ ఉద్దేశ్యంతోనైనా ఆ ఆలోచన చేశారు. కానీ రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి విశాఖని రాజధాని చేస్తానని చెప్పిన జగన్‌ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని పట్టించుకోలేదు.

Also Read – మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా?

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రవేటీకరణని అడ్డుకునే ప్రయత్నం చేయని జగన్‌, ఇప్పుడు దాని గురించి మొసలి కన్నీళ్ళు కార్చుతుండటాన్ని సిఎం చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ కాపాడుకోవడం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నామని, ఇదివరకే ఓసారి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో మాట్లాడానని, మళ్ళీ మాట్లాడుతానని చెప్పారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలంటే అధికారులు, ఉద్యోగులు కూడా ప్లాంట్‌ని లాభాలబాట పట్టించేందుకు గట్టిగా కృషి చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

ఆనాడు ఋషులు యజ్ఞ యాగాలు చేస్తుంటే రాక్షసులు వాటిని భంగం కలిగించేందుకు ప్రయత్నించిన్నట్లే, ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ఓ మంచిపని చేస్తుంటే విమర్శించేవారు, అవరోధాలు సృష్టించేవారు ఉన్నారని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ గురించి మాట్లాడని జగన్‌ ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని సిఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. నిజమే కదా?