వర్మకి జగన్‌ అంటే ఎందుకంత ఇష్టం?

Why Ram Gopal Varma Is Psychologically Drawn to Jagan

దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు సైలంట్ అయ్యారు కానీ జగన్‌ హయంలో ఎంతగా చెలరేగిపోయారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనకు జగన్‌ అంటే చాలా అభిమానం అని ఎవరైనా చెప్తారు.

కానీ వర్మకి జగన్‌ అంటే ఎందుకంత ఇష్టమో వివరిస్తూ ప్రముఖ జర్నలిస్ట్ ‘శ్రీనివాస్ నైట్ ఔల్’ ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.

ADVERTISEMENT

వర్మని రాజకీయ కోణంలో కాక ఆయన సైకలాజికల్ కోణంలో చాలా చక్కగా విశ్లేషించారు. క్లుప్తంగా ఆ విశ్లేషణ…

పీటర్ మెక్‌గ్రా ప్రతిపాదించిన బెనైన్ వైలేషన్ థియరీ ప్రకారం చూసినట్లయితే ఆయన తన మనస్తత్వానికి, ఆలోచనలకు, కోర్కెలకు అనుగుణంగా ఉండే అంశాలు, ఘటనలు, వ్యక్తులు, వారి సంఘర్షణలతో సులువుగా కనెక్ట్ అవుతుంటారు.

జగన్‌ మానసిక స్థితి, ఆలోచనా విధానం, రాజకీయాలు, పోరాటాలు, జీవితంలో ఎదురైన తీవ్ర ఒడిదుడుకులు, కేసులు, జైలు వంటివన్నీ వర్మని జగన్‌వైపు ఆకర్షితులయ్యేలా చేశాయి.

ఈ సిద్ధాంతం ప్రకారం సామాజిక కట్టుబాట్లు, సంస్థాగత నియమాలు ఉల్లంఘించే లేదా వాటిని పట్టించుకోనివారు పరస్పరం ఆకర్షితులవుతారు. ఆ వ్యక్తి మంచివాడా కాదా? అనేది ముఖ్యం కాదు. అవతలి వ్యక్తిలో తనకి ఆసక్తి కలిగించే లక్షణాలున్నాయా లేదా అనేదే ముఖ్యం. సమాజ నియమ నిబంధనల ఉల్లంఘన, భావోద్వేగాల తీవ్రత, సంఘర్షణలే ముఖ్యం.

వర్మ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా అటువంటి వ్యక్తిత్వం కలవారే. ఆవిధంగానే వ్యవహరిస్తుంటారు. ఈ లక్షణాలే వర్మని జగన్‌వైపు ఆకర్షితులయ్యేలా చేశాయి. ఆ క్రమంలో వర్మ మాట్లాడే మాటలు, చేతలు ఆయన జగన్‌కి వీరాభిమాని… వైసీపీ మద్దతుదారు అని ప్రజలు భావించేలా చేస్తుంది.

కానీ ప్రజలు తన గురించి ఏమనుకుంటారో వర్మ అసలు పట్టించుకోరు. కనుక ఆయనపై ఆ ముద్ర పడిపోయింది. కానీ జగన్‌లో తనకు కావాల్సిన ‘మెటీరియల్’ లభిస్తోంది. దానినే వర్మ స్వీకరిస్తున్నారు తప్ప అయన పట్ల అభిమానంతో దగ్గరవలేదు.

ఫిలిప్ జింబార్డో సిద్దాంతం ప్రకారం ఓ పద్దతిగా జీవిస్తున్నవారు, ఓ పద్దతి ప్రకారం సాగుతున్నవారు అటువంటి వారితోనే సులువుగా కనెక్ట్ అవుతారు. వర్మ వంటి భిన్నమైన వ్యక్తిత్వం ఉన్నవారికి అటువంటివారి పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. చంద్రబాబు నాయుడుపై వర్మ ఆసక్తి చూపకపోవడానికి ఇదే ప్రధాన కారణం.

తీవ్రమైన ఒత్తిళ్ళు, ఒంటరితనం, జీవితంలో సంఘర్షణలు, ఎదురు తిరిగి పోరాడటం, భావోద్వేగాలు వంటి లక్షణాలు గల వారిని వర్మ వంటివారు ఇష్టపడతారు. అవి జగన్‌లో పుష్కలంగా ఉన్నాయి కనుకనే వర్మ ఆసక్తి చూపుతుంటారు.

క్లుప్తంగా చెప్పాలంటే మానవ ప్రవర్తనని అధ్యయనం చేయడంపై వర్మలో సహజంగా ఉన్న కుతూహలం వల్లనే జగన్‌తో కనెక్ట్ అయ్యారు. కానీ అది రాజకీయ అభిమానంగా ప్రజలకు కనబడుతుంటుంది.

ADVERTISEMENT
Latest Stories