టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఇప్పుడు ఒవెర్సీస్ లెక్కలు కూడా భారీగానే ఉంటున్నాయి. ముఖ్యంగా కొన్ని సినిమాలకు అయితే ఆ కలెక్షన్స్ భారీగా నమోదు అయ్యీ సినిమాకు మంచి ఫలితాన్ని అందించాయి. అయితే సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచినా సరే ఒవెర్సీస్ లో ప్రీమియర్స్ లో 1 మిలియన్ డాలర్ ను అందుకొలేదు. ఆ రికార్డు ఇప్పటికీ బాహుబలి రెండు భాగాల ఖాతాలో మాత్రమే ఉంది.
[m9ad]
అయితే నందమూరి బాలకృష్ణ కధా నాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న “ఎన్టీఆర్-బయోపిక్” విషయంలో మాత్రం ఈ రికార్డుపై ఆశలు పెట్టుకున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎన్టీఆర్ పై తెలుగు ప్రజల్లో ఉన్న అభిమానం…మరో పక్క ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్..మరో పక్క బాయోపిక్స్ పై ఎన్నారైలు మంచి అభిప్రాయంతో ఉన్నారు. తాజాగా వచ్చిన మహానాటి బయోపిక్ కి బ్రహ్మరధం పట్టారు ఎన్నారైలు, ఇక ఈ క్రమంలోనే అటు ఈ సినిమా మంగళవారం నాడు విడుదల కావడం, ప్రతీవారం అదే రోజు ఆఫర్స్ డే కావడంతో ఈ సినిమా ట్రేడ్ అంచనాల అప్రకారం తొలి రోజు ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్స్ ట్రేడ్ మార్క్ కు అందుకుంటుంది అని చెబుతున్నారు.
అయితే అదే జరిగితే మాత్రం ఒక నాయకుడి “చరిత్ర”గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒవెర్సీస్ లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుంది అని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. మరి అక్కడే ఆ రేంజ్ ఉంటే…ఎన్టీవోడు తెలుగు రాష్ట్రాల్లో కలక్షన్ల ప్రభనజనం సృష్టిస్తాడు అని చెప్పక తప్పదు.



