రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తారా?

Will TDP Suspend Revanth Reddyతెలంగాణ టీడీపీ సర్వసభ్యసమావేశం అర్ధాంతరంగా ముగిసింది. సమావేశం హాట్‌హాట్‌గా సాగిండట. రేవంత్‌రెడ్డి, సీనియర్ నేత మోత్కుపల్లి మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం, రాహుల్‌ను ఎందుకు కలిశావని రేవంత్‌ను నిలదీసిన మోత్కుపల్లి. మోత్కుపల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పని రేవంత్‌ రెడ్డి.

వర్కింగ్‌ ప్రెసిడింట్‌ అయిన తనను ప్రశ్నించే హక్కు లేదన్న రేవంత్‌. మోత్కుపల్లి వైఖరికి నిరసనగా మధ్యలో వెళ్లిపోయిన రేవంత్‌ రెడ్డి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పాడ్తుంనదని రేవంత్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తరేమో చూడాలి. రేవంత్ పార్టీ మారడం ఖాయంగానే కనిపిస్తుంది

ADVERTISEMENT

ఆయనతో పాటు పదహారు జిల్లాల తెదేపా అద్యక్షులు కాంగ్రెస్ లో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేలలో కూడా కొందరు కాంగ్రెస్ లోకి రావచ్చని అంటున్నారు. భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్, సూర్యాపేట జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కేడర్‌ మారే అవకాశం ఉందని రేవంత్ వర్గంవారు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories