చిరంజీవికి చెక్ పెట్టగలడా?

Chiranjeevi about vijay deverakonda --Geetha Govindamబాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ వీరవిహారం కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణాలతో పాటు తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలలోనూ దుమ్ముదులుపుతోన్న “గీత గోవిందం,” యుఎస్ లో 2 మిలియన్ మార్క్ ను టచ్ చేసింది. దీంతో 2 మిలియన్ క్లబ్ లోకి ప్రవేశించిన ప్రభాస్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ ల సరసన నిలిచాడు విజయ్ దేవరకొండ.

[m9ad]

ADVERTISEMENT

అయితే యుఎస్ బాక్సాఫీస్ వద్ద “గీత గోవిందం” ఎంతవరకు వసూలు చేస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చేవారంలో కూడా బరిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో, “గీత గోవిందం”దే పండగ అంతా! కానీ యుఎస్ కు వచ్చేసరికి 2 వారాలు గడిచిందంటే, దాదాపుగా ఆ సినిమా తుదిదశకు చేరుకున్నట్లే. కానీ ‘గీత గోవిందం’ పరిస్థితి అంత దారుణంగా అయితే లేదు, మరో వారం వరకు యుఎస్ లో విజయవంతంగా ప్రదర్శితం కావచ్చు.

ఇప్పటివరకు అయితే 2 మిలియన్స్ వసూలు చేసింది, అలాగే రేపో మాపో జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో,’ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలను అధిగమించడం తధ్యం. అయితే ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” సాధించిన 2.4 మిలియన్ డాలర్స్ ను అందుకుంటాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ట్రేడ్ వర్గాల ప్రకారం “గీత గోవిందం” 2.2 మిలియన్ డాలర్స్ వరకు కొల్లగొట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories